Tuesday, December 30, 2008

"నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు" !!!

నేను ఎప్పుడూ డిసెంబర్ 31 రాత్రి అంతగా జరుపుకున్నట్టు గుర్తులేదు, దానికి రెండు కారణాలు.
1. ఊగాది రోజే తెలుగు వారికి క్రొత్త సంవత్సరం వస్తుంది అని నమ్ముతాను కాబట్టి.
2. గత పది సంవత్సరాలు గా, ప్రస్తుతం కూడా, టెలీకాం రంగంలో ఉద్యోగం చేస్తుండడం తో ప్రతి డిసెంబర్ 31 రాత్రి, ప్రజల కాల్స్ , యెస్.ఎం.యెస్ ల వల్ల సర్వర్స్ లోడ్ పెరుగుతుంది కాబట్టి, వాటిని మానిటర్ చేస్తూ, సమస్యలు వస్తే సరిదిద్ది, అంతా సద్దుమణిగాకా తీరిగ్గా తెల్లవారు ఝామున నాలుగు లేదా ఐదింటికి ఇంటీకి చేరేవాడీని .

అంతే కాకకుండా డిసెంబర్ 31న నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పకుండా
"నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు" అని చెప్పేవాడిని,.



"నేటి మధ్య వయసు తల్లి తండ్రులే తరువాత తరానికి వారధులు . "


అందుకే !! ఎందుకో తెలియదు గాని నేను ఎప్పుడూ ఇంతే !!.



అదేకాక మావాళ్ళు చాలా మంది ఫ్రేండ్ షిప్ డే అని తెగ జరుపు కొనే వాళ్ళు ,
రంగు రంగు ల గ్రీటింగ్స్ , ఎవడో రాసిన పెద్ద పెద్ద సందేశాలు , ఇంకా ఇంకా , అటూ ఇటు తెగ పంపేసుకోనెవారు . నేను కావాలని ఫ్రేండ్ షిప్ డే తరువాత రోజు అందరికి "హాపి ఫ్రేండ్ షిప్ డే " అని ఈ-మైల్ పంపి ,కింద ఇలా రాసేవాడిని ..
" నిజమైన స్నేహితులకి ఏ రోజు అయితేనే ?" అని,
అలాగే వాలైంటైన్ డే ,మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇవన్ని కేవలం గ్రీటింగ్స్ మరియు గిఫ్ట్ షాప్ వాళ్ళని పెంచి పోషించడానికే !!!


మనసులో వున్న స్వచ్చమైన ప్రేమ భావాన్ని తెలపడానికి మంచి రోజు కోసం ఎదురుచూడకండి , !!







Wednesday, December 24, 2008

మనసుతత్వం : ప్రేమలో సక్సెస్ లేదా ఫెయిల్ !!!

ప్రేమ లో సక్సెస్ అయితే ఒక పాట పాడుకోవడమో లేదా ఒక పార్టీ చేసుకోవడమో ,
ప్రేమ లో ఫెయిల్ అయితే మందు కొడుతూ బాధ పడటమో ,లేదా ఆత్మహత్య, మనము రోజు చుసేవుంటాము ,
అసలు ప్రేమలో సక్సెస్ లేదా ఫెయిల్ అనేవి వాస్తవాని కి ఎందుకు పనికి రాని మాటలు,



ప్రేమలో సక్సెస్ అంటే ఒక అమ్మాయ్ లేదా అబ్బాయి మనసు గెలిస్తే సరిపోతుందా ?
సరే మనసు గెలిచావు ,ఇద్దరు ఇష్టపడ్డారు , తర్వాత ?



ఉద్యోగం,తల్లి తండ్రుల బాధ్యత ,నీ అలవాట్లు,నీ మనస్తత్వం ,నీ బాధ లు,నీ మీద ఆధార పడే మనుషు లు ,నీ కోపం ,నీ ఆరోగ్యం ,
వలన మీ మధ్య ఎటువంటి తేడాలు రాకుండా అవతలి వ్యక్తీ తో జీవితాంతం అవతలి వారి అభిప్రాయాలకి విలువ ఇస్తూ సాఫీ జీవితం సాగితే నే నీ ప్రేమ సక్సెస్ అయినట్టు .ఇన్ని అభిప్రాయాలని పంచుకొని ,అర్థం చేసుకుని, అవగాహన తెచ్చుకొని,ఒకరినొకరు సంసిద్ధం చేసుకోవడమే ప్రేమించు కోవడం,ప్రేమించు కోవడమంటె సినెమాలు , షికార్లు ,తో పాటు జీవితం లొ ఆఖరి అడుగు వేసె వరకు జరగబోయె సంఘటనలు అన్ని మాట్లాడుకోవాలి.


మా అబ్బాయి / అమ్మాయి కి పెళ్ళి కుదిరింది , అబ్బాయి ది చాలా పెద్ద ఉద్యొగం,అమ్మయి చాలా బాగుంటుంది,మంచి కుటుంబం, బాగా డబ్బు వుంది , నా గర్ల్ ఫ్రండ్ యస్ అంది, నాకు ఒక అబ్బాయి ప్రపొస్ చేసాడు, పెళ్ళీ ఎక్కడా ?, కట్నం ఎంత ? , వాలంటైనె గిఫ్ట్ ఏం కొంటున్నావ్ ?, హానీ మూన్ కి ఎక్కడికి వెల్తున్నారు ?నేను లవ్ లొ పడ్డాను ( అసలు లవ్ లో పడడం ఏమిటో , ఈ తెలుగు సినిమా మాట అంటే నాకు పరమ ఎలర్జి, హాయిగా మనసు పడ్దా, ప్రేమిస్తున్నా, ఇష్ట పడుతున్నా అనచ్చు కదా!! )ఇదే పైకి కనపడేది , కాని ,
ఎవరైనా ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నరు ? ఆ మాటలు, ఆ ప్రశ్నలు ,ఆ సమాధానాలు వాళ్ళ సంసారంకి,కలసి నడిచే జీవితానికి ఉపయోగపడతాయా? అని ఎందుకు ఆలోచించరు ? ఇది ప్రేమా మరియు పెద్దల కుదిర్చిన పెళ్ళీలకి వర్తిస్తుంది.

ఇద్దరు మనసులు కలయిక కేవలం తోలి అడుగు మాత్రమే.మీ తొలి అడుగు సక్సెస్ కావాలంటే ఇంకా ఎన్ని వేల ,లక్ష అడుగులో నడవాలి.


వంద అబద్దాలు ఆడి ఐనా ఒక పెళ్ళి చెయ్యాలన్నారు పాత పెద్దలు,
కాని నేను చెప్పెది ప్రేమ లేదా పెళ్ళీ అంటే వంద నిజాలు.
ప్రతీ చిన్న విషయం మాట్లాడుకొని తీరాలి ,మనస్పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాలి.



ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి సంబంధాలనైనా మెరుగుపరిచి దగ్గర చేసేది స్పష్ట మైన మాటలే.
మాట్లాడకపోతే ఏం జరుగుతుంది..కొన్ని నిజ సంఘటనలతో .... (ఇంకా వుంది)

Monday, December 22, 2008

సమాచారం - సముద్రగర్భ ఇంటర్నెట్ తీగలను ఎలా బాగు చేస్తారు ?

భారత దేశం నించి యూరోప్ కి వెళ్ళే సముద్రగర్భ ఇంటర్నెట్ తీగలు తెగినందున ఇంటర్నెట్ సర్విస్ లొ సమస్యలు , ఇంటర్నెట్ చాలా నెమ్మదించడం జరుగుతోంది . దీని వలన మన దేశం లొ 82% వరకు ఇంటర్నెట్ సేవలకి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. డిసెంబర్ 31 కి పూర్తిగా పునరుద్దరణ జరగచ్చు అని ఫ్రాన్స్ టెలికాం ఒక ప్రకటనలో తెలిపింది. సముద్రగర్భ తీగలని బాగుచేసే ఉహా వీడియో క్రింద చూడండి .
http://www.labnol.org/internet/internet-disrupted-as-undersea-cables-cut-again/6146/

Friday, December 19, 2008

మనసు తత్వం : పిల్లల అలవాట్లు!!

నేటి పిల్లల అలవాట్లు,తల్లి తండ్రుల పాత్ర :

తమ పిల్లలు కొన్ని విషయాల పై ఇష్టం చూపితే తెగ మురిసిపోతారు,లేదా మావాడూ పెద్ద వాడు అయిపోయాడు అనుకోవడం ,
వాళ్ళ కొత్త అలవాట్లని అంతగా పట్టించుకోకపోవడం ,వారి దైనందిన కార్యక్రమాల మీద అంతగా శ్రద్ధ పెట్టకఫొవడం నేటి తల్లి తండ్రులు చేస్తున్న తప్పులు.ఒక మంచి అలవాటు కొత్త గా నేర్పించకపోయినా కనీసం వారు రోజూ చేసే పనులని సక్రమంగా చేసేలా చూస్తే చాలు.
ఒక పద్దతి గా వారు చేసే పనులు,వారిని ఒక మంచి వ్యక్తి గా తీర్చిదిద్దుతాయి.


ముఖ్యంగా క్రింద విషయాలలో కొద్ది పాటి అజాగ్రత్త పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేయ్యగలదు.


ఆరోగ్యం:
అతిగా టీ.వి చూడడం !! పడుకుని , దగ్గరగా చుడడం.కంప్యూటర్ ఆటలు.వీటి వలన కంటికి చాలా ఒత్తిడి పెరుగుతుంది.ఇది చిన్న విషయమే అయినా దీని ఫలితం కొన్ని సంవత్సరాల తరువాత తప్పక కనపడుతుంది.
తక్కువగా నడవడం,ఆటలు ఆడకపోవడం.


శుభ్రత :
సరిగా పళ్ళూ తోముకోకపొవడం.
చాలా మంది పిల్లలకి పళ్ళు ఎలా తోముకోవాలో సరిగా తెలియదు , ఏదొ అటు ఇటూ గీకి పడేస్తారు.
స్నానం సరిగా చేయకపోవడం,
బాత్ రూం కి వెళ్ళి వచ్చకా చేతులు కడుక్కోకపోవడం,
బయటనించి రాగనే కాళ్ళు కడుక్కోకపోవడం,
బయటకి వాడె చెప్పులు, షూస్ తొ ఇంట్లొ తిరగడం,


ఆహారం:
చాలా మంది పిల్లలు అన్నం తినడం హడావిడీగా ముగించేస్తారు,ఏం తిన్నాడు ,ఎంత తిన్నడు అనేది ఎవరు చూడరు.
పిల్లల ఇష్టా అయిష్టాల ను పక్కన పెట్టి అన్ని తినేలా తల్లి తండ్రులే నేర్పించాలి .

భాద్యత:
ఇది వినడానికి చాలా పెద్ద మాట గా కనపడినా,
పిల్లలకి చిన్నప్పటి నించే వారి పనులు వారు చేసుకోవడం నేర్పించాలి.
వారు ఆట వస్తువులు వారే సర్దుకోవడం,
ఇంటిని శుభ్రంగా వుంచడం,
అప్పుడపుడు వారికి కొన్ని చిన్న చిన్న పనులు చెప్పడం
ఇంటికి ఎవరైనా వచ్చినపుడూ ఎలా మాట్లాడాలి ఎలా లో చెప్పడం .


ఇలా చెప్పుకుపోతే చాలానే వుంటాయి , కాని ఇక్కడ మనం ఒక విషయం గుర్తుకుపెట్టుకోవాలి,ఒక వయస్సు వచ్చాకా పిల్లలు తల్లి తండ్రులు మాట వినరు,ఆ వయస్సు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు.ఎందుకటే నేటి పిల్లలు చాలా తొందరగా పెద్దవారైపోతున్నారు.

Thursday, December 18, 2008

జీవితం - కొన్ని మంచి మాటలు !!

నువ్వు క్రింద పడిపోయినపుడు,ఎక్కడ పడ్డావో చూడకు,ఎక్కడనించి పడిపోయావో చూడు. ఎందుకంటే పడిపొయిన ప్రాంతం నించే నువ్వు మళ్ళీ వెరే దారి లొ పయనం మొదలుపెట్టాలి . జీవితం అంటే సరిదిద్దు కోవడం,తప్పులని పదే పదే తలచుకోవడం కాదు.



అన్ని మూసిన తలుపులకి తాళాలు వుండవు !!!


నేను "జీవితంలొ చాలా సందర్భాలలో ఓడిపోయా" అనేమాటనే ఇలా చెప్పండి"నేను చాలా సందర్భాలలో ఓడిపొవడం ఎలా అని విజయవంతం గా తెలుసుకున్నా"


జీవితం నీకు కావలసింది ఇవ్వదు ,నువ్వు కోరుకున్నదే ఇస్తుంది

Tuesday, December 16, 2008

అపార్ట్ మెంట్ గార్డెన్ - చిత్రాలు !!!

ఒకటవ తరగతి నించి,ఇంటర్ వరకు మా ఇంటి ముందున్న రకరకాల పువ్వులమొక్కలు,పెరటిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు నా నేస్తాలు.మందార ,గులాబి, నైట్ క్వీన్,సంపెంగ,కనకాంబరం,క్రోటన్స్,యూకలిప్టస్,మామిడి,అరటి,నేను విసిరిన టెంక తొ వచ్చిన చిన్న మామిడి చెట్టు,మా మామిడి చెట్లకి పెట్టిన పేర్లు ,మాగాయి చెట్టు(అంటే ఈ చెట్టు కాయల తొ మాగాయి పెట్టెవాళ్ళం),దిబ్బ చెట్టు (సన్నగా పొడవుగా ఉండేది),సువర్ణ రేఖ, ఇంకా ..చిన్న ఉసిరి,పెద్ద (రాతి)ఉసిరి,బొప్పాయి, కొబ్బరి చెట్ల కింద నేను గడిపిన ఆ రోజులు,ఆ ఆటలు మరువలేనివి.


వివిధ ప్రాంతాలు తిరిగి తిరిగి, చివరకి హైదరాబాద్ వచ్చి ఆగాము,ఇక్కడ మేముంటున్న కంపార్ట్ మెంట్ లాంటీ అపార్ట్ మెంట్ లొ కొంచెం జాగా, మంచి వెలుతురు కనపడే సరికి కొన్ని మొక్కలు తెచ్చి వరసగా పెట్టేసాం.మా అపార్ట్ మెంట్ ఇరుకు బాల్కని లొ కొత్త గా వేసుకున్న కొన్ని మొక్కల ఫొటోలు (8MB High Resolution) ,వరుస క్రమం లొ...రెండు రోజుల లేత మెంతి మొలకలు ,చామంతులు,లేత గులాబి చిగురు .



















Monday, December 15, 2008

ఏదో సరదాకి !!!

నా కాలేజి రోజులనించి అక్కడా ఇక్కడా విన్న,అనుభవంలోకి వచ్చిన కొన్ని సరదా మాటలు...

****
ఒక సారి నేను ఆఫీస్ కి వెళ్ళగానే మా సెక్యూరిటి ఇలా అన్నాడు
"సార్ మిమ్మల్ని ప్రసాద్ గారు కాల్చెయ్యమన్నారు " ,
ఒక్క సారి ఖంగు తిని "తుపాకి తోనా ? ఎవరిని అన్నా ?"
వెంటనే సెక్యూరిటి గట్టి గా నవ్వి "తుపాకి కాదు సార్ !! కాల్ ,ఫొన్ కాల్ చెయ్య మన్నారు సార్ !!" అన్నాడు ,
దాంతొ అక్కడున్న అందరూ గొల్లుమన్నారు.

****

మా వాళ్ళు కొందరి పేర్లు ప్రేమ తొ ఇలా తిరగ పలికేవారు

sachin : సచ్చినోడు
Arnold Schwarzenegger (అదేనండి టెర్మినేటర్ హీరో) : "ఆర్నాల్డ్ శివాజి నిక్కర్ "
Herschelle Gibbs (సౌత్ ఆఫ్రికా క్రికెటర్): "అరిసెల గిబ్స్"

Friday, December 12, 2008

తొక్కలో ట్రైనింగ్ సెంటర్ !!

సారీ !!! టీ.విలొ ట్రైనింగ్ అని రాయబోయి అచ్హుతప్పు పడింది,
మావాడు చూడకుండా అచ్చు ఎసేసినాడూ,ఏటి అనుకోకండే ..అచ్హుతప్పులు ఎక్కడికక్కడ సక్కగా సరిదిద్దినాం !!



రండి రండీ రండీ !!! మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఒక లాప్ టాప్ బాగ్ ఉచితం !!
మళ్ళీ సారి !! "బాగ్" ని చిన్న అక్షరాలతో రాయడం పోయినాడండి !! ఆయ్!!
టీ.వి రంగం లొ తల వేడెక్కిన పెద్దలు మీకు దగ్గర వుండి మీకు అన్ని విషయాలు తలక్కెకిస్తారు.



మా బాధకుల (సారి బోధకుల) అనుభవాలు :

అనంత మానస తరంగాలు అనే సీరియల్ కోసం టేబిల్ కింద కూర్చుని ఎవరూ చూడకుండా రాసిన స్క్ర్రిప్ట్ .
"స.రి.గ.మ.ప.ద.ని.స.ని.ద.ప.మ" హింది సింగర్స్ తొ తెలుగు పాటల కార్యక్రమం.
"అబ్బనీ తీయని దెబ్బ !!" అంతా తమిళులే ఉన్న ఏకైక తెలుగు పాటల డాన్స్ కార్యక్రమం .
చెత్త ప్రశ్నలు ,పిచ్హి జవాబులు .
లక్ష ఎపిసొడ్స్ పూర్తి చెసుకున్న సీరియల్ (ఇది ఎప్పుడు,ఎవడూ మొదలెట్టాడో మాకే తెలియదు),
అ.క.కు.త.క.అ (అసూయ,కన్నీళ్ళూ,కుట్ర,తగాదా,కపటబుద్ది,అక్రమ).




అర్హత :
ఏంటీ జొకులా !! మీరు మనిషి అయితే చాలు !!
మీరు ఆల్రెడీ టీ.వి లొ వున్న/పాల్గొంటున్నా ఈ కొర్సు తీసుకోవచ్హు.



మా ట్రైనింగ్ లో మీకు నేర్పించేవి :

పోటిలొ మీరు వొట్ ఔట్ లేదా ఓడిపొతే మీరు ఎలా వెక్కి వెక్కి ఏడవాలి !!
వేరే వాళ్ళు పోటి లోంచి ఔట్ అయితే , పైకి ఏడుస్తూ ఎలా నటించాలి ?
జడ్జిల కి మాంఛి మాటల్ ట్రైనింగ్ అంటే ...
"చింపావు","కత్తి"," ఫాబులస్స్","సూపర్ర్","ఇరగదీసావు" ఇలాంటివి మాదగ్గర పది వేల మాటలు ఉన్నాయి.
రాజకీయ ముఖాముఖిలలొ గట్టిగా అరవడం ఎలా ? అవతలి వారి మాటలు వినకుండా మీ మాటలే వినపడెలా ఎలా మాట్లాడాలి ?
వార్తలు చదివేటప్పుడు కనుబొమ్మలు ఎలా ఎగరేయాలి , ఇంకా అనేక హావ భావాలు ఎలా పెట్టాలి?
జడ్జి మిమ్మలని తిట్టాలంటే ఎలా పిచ్హిగా మాట్లాడాలి ? తద్వారా , మీకు ఎక్కువ పాపులారిటీ ఎలా తెచ్హుకోవాలి ?
పర భాషా జడ్జి ఖూని తెలుగుని అర్థం చేసుకోవడం ఎలా ?
మీరు టి.వీ నటులైతే ,డైలీ సీరియల్ షూటింగ్ అయిపోయాకా మీరు మాములు మనిషిగా ఎలా మారాలి ?



చివరిగా టీ.వి ప్రేక్షకులకి ఒక క్రాష్ కోర్స్:
పగలకొట్టబడిన టి.వీ ని మళ్ళీ మళ్ళీ ఎలా బాగు చేయ్యాలి ?

Thursday, December 11, 2008

మంగళగిరి జైన్ దేవాలయం అందాలు !!

నేను చదువు మరియు ఉద్యోగరీత్యా గుంటూరు,విజయవాడ ప్రాంతాలలొ ఉన్నపుడు ఈ జైన్ గుడికి తరుచూ వెళ్ళేవాళ్ళము. విజయవాడకి 12కి.మి దూరంలొ గుంటూరు కి వెళ్ళే దారిలొ ఉంది ఈ గుడి.చాలా కాలం క్రితం అక్కడ వున్న ఒక పెద్ద మనిషి ఆ గుడి గురించి ఇలా చెప్పారు " చాలా ఏళ్ళ క్రితం ఒక జైన్ మతగురువు అనేక ప్రదేశాలు తిరిగి తిరిగి ఇక్కడకు వచ్చి, గుడీ ఇక్కడే కట్టాలి అన్నారట , అక్కడ అప్పుడు ఒక అగ్గి పెట్టెల ఫాక్టరి వుండేదట, అంతే కాక జైన్లు ఎవరి దగ్గరా విరాళం తీసుకొరట , జైన్లు ఇచ్హిన డబ్బుతోనే గుడి ని కడతారట. అక్కడ తీసిన కొన్ని ఫొటొలు.













Wednesday, December 10, 2008

మనసు తత్వం - పెళ్ళైయిన వారికి మాత్రమే !! -2

ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఆలోచించరు , మీరు ఎలా అయితె మీ భాగస్వామి లొ నచ్హనవి గుర్తిస్తారో, అదేవిధంగా అవతలవారు అలాగే అనుకుంటారు. నేను ముందు చెప్పినట్టు ఎప్పుడైతే మీ భాగస్వామి గురించి పూర్తి గా తెలిసిందో ,
అప్పుడు నించి మీరు రాజి పడేకన్నా వారి ఇష్టం ,అయిష్టంలకి తగ్గట్టూగా నడవడం మొదలుపెట్టండి.


నా కర్మ,నా బ్రతుకు ఇంతే ,నేను అస్సలు ఇంక మాట్లాడను ,అన్ని నువ్వు చెప్పినట్టే వింటాను,
నాకు ఆ హక్కు లేదా ?,మన ఇద్దరి రుచులు,అభిరుచులు వేరు ,ఇంక నా జీవితం ఇంతే ,అని భారి మాటలు చెప్పేకన్నా , మీరు ఒక విషయం జాగ్రర్త గా ఆలొచించి గుర్తు పెట్టుకోండి, మీరు మీ భాగస్వామి తొ చాలా కాలం గా ఉన్నారు కాబట్టి మీకు అవతలి వారి గురించి అన్ని తెలిసి , వారి గురించి ఒక అభిప్రాయానికి వచ్చి,కాదు కాదు ,అభిప్రాయాబేధాల దగ్గర ఆగి , దానిని పరిష్కరించుకోలేక పారిపోతున్నారు.
చాలా మంది అనుకుంటూవుంటారు ,నాకు ఇంట్లొనే గొడవలు,బయటకు స్నేహితుల దగ్గరికి వెడితే చాలా బాగుంటుంది అని, కాని మీరు మీ మీ స్నేహితులలతో కూడా కొన్ని సంవత్సరాలు కలసి వుంటే ఇవే కాకపోయినా వేరే అభిప్రాయాబేధాలు తప్పకుండా వస్తాయి.


సమస్య వచ్హినప్పుడు దాని నుంచి దూరం గా పారిపొవటం కన్న , దానిని పరిష్కరించేలా ముందుకు సాగడం మేలు .


తమ భాగస్వామితొ సమస్య వచ్చినప్పుడు చాలా మంది తమలొ బాధని వేరే వాళ్ళతోనే ఎక్కువగా చెప్పుకుంటారు ,ఇదే అసలు సమస్య, వేరె వాళ్ళు మీకు సానుభూతి లేదా సహాయ మాటలు చెప్తారుగాని వారికి మీ సమస్య గురించి అంతా గా తెలియదు, ఎందుకంటే మీరు వాళ్ళకి పూర్తి సారం చెప్పరు ,చెప్పలేరు.

ఇక్కడ మీ అసలు సమస్య కొద్దిగా కరగడం మొదలు పెడుతుంది , ఆ వేరేవాళ్ళు మీ సమస్యని ఇంకోవాళ్ళతో మాట్లాడి , మీ సమస్యని ఇంకా కరిగిస్తారు , అది మీకు కొత్త సమస్య గా మారి ,అవతలి వారికి మంచి వినోదం ఇస్తుంది.

మీ సమస్యల మధ్య మూడో వ్యక్తి ని రానియకండి , మీ సమస్యలని వేరే వాళ్ళకి చెప్పకండి.


ఒక విషయం మీద అభిప్రాయాబేధాలు వచ్చినపుడు, మీకు శారిరకంగా గాని ,మానసికంగా గాని బాధలేన్నపుడు అవతలి వారి మాట వినడం మేలు , ఇది చాలా మంది చేయరు దానికి అహాం అనేది ఒకటి అడ్డువస్తుంది .
చిన్నగా చెప్పండి , కోపం తెచ్చుకోండి ( అప్పుడప్పుడు కోపం మంచిదే ) కాని కోపం తగ్గకా మళ్ళీ చిన్నగా చెప్పండి .
ఒక ఒప్పందానికి రండి , ఈ సారి నామాట విందాం , తరువాత నీమాట వింటా. నీకు నచ్చింది నువ్వు చేయి , నాకు నచ్హింది నేను చెస్తా. నీ పనులలొ నేను తలదూర్చను , నా పనులలొ నువ్వు తలదూర్చకు, కాని సలహా మాత్రం ఇవ్వు. మీకు నచ్చిన విషయాలపై అవతలివారిని బలవంతం చేయ్యకండి , మీ ఇష్టాలు అవతలివారి మీద రుద్ద కండి, అవలతలివారి ఇష్టాలు,హాబిలకి గౌరవం ఇవ్వండి .


ఎప్పుడైతే మీరు ఒక సమస్య ని పూర్తిగా పరిష్కరించుకోకుండా ముందుకు వెళ్ళారో ,
ఆ సమస్య ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచి , వేరే చిన్న సమస్య వచ్చినపుడు పాత సమస్య కోపం బయటకు వస్తుంది ,
చాలా మంది ప్రతీ గొడవలొ కొంత మిగులు ఉంచుకొని ముందుకు వెళ్తూవుంటారు ,
ఆ మిగులు కొద్ది కాలనికి పెరిగి పెద్దదై మీ సంబంధాలనే మింగేస్తుంది .

మీ భాగస్వామి మీకు ఫ్రీ గా వచ్హిన గిఫ్ట్ లా అనుకోకండి , వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మీ అభిప్రయాలు ఏమిటో వివరంగా చెప్పండి. మీ భాగస్వామి కూడా మీలాగే కొన్ని సంవత్సరాలు తనదంటూ ఒక జీవితం గడిపారని గుర్తుంచుకోండి , ఒక్క సారిగా మీకు నచ్చినట్టు మారిపోవాలంటె జరగనిపని.
మనం మారుతూ అవతలి వారిని మార్చుకోవడమే సంసారం.


రెండు అందమైన నిజాలతో ఇంక ముగిస్తా.


చాలామందికి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం,ముద్దు,
కాని అదే ముద్దు ,ఇష్టం వాళ్ళ భాగస్వామి మీద చూపించరు,ఎందుకంటే ...,
పిల్లలు చెప్పిన ప్రతీ మాటా వింటారు, వినకపోతె గట్టి గా అరిస్తె లేదా ఒక దెబ్బ వేస్తే మాటా వింటారు,
పిల్లలు తిరిగి మీమీద కోపం పెంచుకోరు , అన్ని త్వరగా మర్చిపోతారు.
కాని మీ ప్రియమైన భార్యా/భర్తా అంత సులభంగా వినరు , ఏమన్న అన్నా, మర్చిపోరు !!

ప్రతీ భార్యా/భర్తా మూడు రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు
1. ఇంట్లొ ,పిల్లలు,కుటుంబ సభ్యులు,బంధువుల మధ్య
2. బయట వ్యక్తులతొ,బాస్,స్నేహితులతొ ,పక్క ఇంటి వాళ్ళు,షాప్ వాడు,ఇంకా ఇంకా,
3. పడక గదిలొ కేవలం భర్యా /భర్త మాత్రమే వున్నపుడూ.


తరువాత మనసు తత్వం : ఎన్.ఆర్.ఐ జీవితాలు

Monday, December 8, 2008

మనసు తత్వం - పెళ్ళైయిన వారికి మాత్రమే !! -1

అలా అని ఏం లేదు ఎవరైనా చదవచ్హు ....

ఇటుకలతొ గోడ కడుతున్నపుడు ఒక్కకసారి , రెండు ఇటుకల మధ్య దూరం వస్తుంది,
దానికొసం ఏదైన ఒక ఇటుకని తాపి* తొ ఒక్క సారి గట్టిగా కొట్టి ,చెక్కి సమానం చెస్తారు.
అప్పుడే గోడ బలం గా ధ్రుడంగా నిలుస్తుంది.
కాపురం కుడా అంతె , మాటల దెబ్బలు తగుల్తూనె ఉంటయి ,
ముందు ముందు సాఫీగా సాగాలంటె అప్పుడప్పుడు గట్టిగా మనసులొ వున్న మాటలని చెప్పక తప్పదు.
(*తాపి : అంటే ఇల్లు కట్టెటప్పుడు వాడె ఒక పనిముట్టు.)


*******************

పెళ్ళైన కొత్తల్లొ చిన్న చిన్న గొడవలు,అభిప్రాయబేధాలు సహజం ,అప్పుడూ మనసు చాలా బాధ పడుతుంది,
పెళ్ళైన కొన్ని ఏళ్ళకి కుడా చిన్న చిన్న గొడవలు,అభిప్రాయబేధాలు వస్తూనే వుంటయి.
కాని అప్పుడు ఎవరు అస్సలు బాధ పడరు ఎందుకంటె ఆ సమయానికి అన్ని అలవాటు అయిపొతాయి.
నా ఉద్దెశం బాధపడటం అలవాటు అవుతుంది అని కాదు , అవతలి వారి మనస్తత్వం అలవాటు అవుతుంది అని.
మీరు ఎలా వుండాలొ అవతలి వారికి చెప్పె కన్నా,అవతలవారికి ఏం నచ్హుతుందొ తెలుసుకొని ప్రవర్తించాలి.


*********************


సాధారణంగా చాలా మంది తమ బాగస్వామి ఇలా వుండాలి అని ఆలోచించకుండానే పెళ్ళీ చెసుకుంటారు,
కొన్ని అనవసర విషయాలలు తప్ప అవి, రంగు, చదువు , ఎత్తు, పెళ్ళయాకా ఉద్యొగం చెస్తావా ?
ఇండియా నా లేకా అమెరికా నా? ఇంకా ఇంకా ...
పెళ్ళైన తర్వాత బాగస్వామి ప్రవర్తన, మాట తీరు , అలవాట్లు, నడవడిక, వల్లన తమకు దొరికినవి , దొరకనివి తేటతెల్లమౌతాయి ,
అవన్ని దౄష్టి లొ పెట్టుకొని ,పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకి తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలొ కచ్హితమైన అభిప్రాయానికి వస్తారు.
కాని అప్పటి కి పరిస్థితి చెయ్యి దాటి పోతుంది , రాజి compramise అనేది మొదలౌతుంది , ( సినిమా వాళ్ళని పక్క పెట్టండి) ,
అటువంటి జీవితాన్ని చాలా తక్కువ మంది ఆనందిస్తూ గడుపుతారు ,అదెలా అంటె ...

(ఇంకా వుంది)

Friday, December 5, 2008

సోని పరిణయం : హాస్య కధ

డెల్ డెస్క్ టాప్ ఇంటెర్నెట్ లొ తన ఎల్.సి.డి మానిటర్ లొ ఈనాడు చదువుతున్నాడు , డెల్ లాప్ టాప్ పక్కనె వచ్హి నిల్చుంది ,
" నాన్న్నా నేను ప్రెమిస్తున్నాను " ఒక్క సారిగా చివుక్కున తల ఎత్త్తి చుసాడు డెల్ డెస్క్ టాప్ ,
ఈనాడు ని మినిమైజ్ చేసి ,దీర్గంగా నిటూర్చి ఇలా అన్నాడు " ఎవరిని ?" , నెమ్మది గా "సొని ని " అన్నాడు డెల్ లాప్ టాప్

పక్కనే వున్న తల్లి డి.వి.డి RW , అన్న లేజెర్ ప్రింటర్ ,వదిన స్కానర్ , చెల్లి వైర్లెస్స్ రౌటర్ , భయం భయం గా చుస్తున్నారు ముక్కోపి ఐన డెల్ డెస్క్ టాప్ ఎమంటాడొ అని.

"చూడు డెల్ బాబు !! మనది విండౌస్ విస్టా వంశం, మన రాం 4GB ,మనకున్నత రాం మెమరి ఈ చుట్టూ పక్కల ఎవరికీ లెదు ,
ఇంక హార్డ్ డిస్క్ అంటావా , పది తరాలు కుర్చుని తీన్నా సరి పోతుంది , మన వంశం పరువు , ప్రతిస్ట , దిగజారెలా ప్రవర్తించ్హద్దు 'అన్నాడు

వెంటనె డెల్ లాప్ టాప్ ఇలా అన్నడు " కనీసం సొని గురించి తెలుసుకొకుండా మీరు అలా అనడం బాగాలెదు"
"సరె ఇంతకి సొని ది ఏ వంశం ? ఎక్కడవుంటారు ?" అన్నడు డెల్ డెస్క్ టాప్

"సొని లాప్ టాప్ ది , విండౌస్-95 ,సొని రాం 128MB , వాళ్ళ నాన్న దగ్గర 256MB వుంది,అందులొ సొని కి ఒక 128MB ఇస్తాన్నాడు
సొని మనసు వెన్న !! తన జీవితం లొ ఎప్పుడూ క్రాష్ అవ్వలెదు , ఒక్క వైరస్ కూడా రాలెదు ,
తన హార్డ్ డిస్క్ 10GB ఐనా ఇప్పటి దాకా తనకి ఏ లోటూ రాలెదు
సొని తండ్రి విండౌస్ 95 డెస్క్ టాప్ , తల్లి ఫ్లాపి , అన్న 64kbps మోడెం , తమ్ముడు ఇంక్ జెట్ ప్రింటర్ ,
పదిలం గా అల్లూ కున్న పొదరిల్లు మాది అని రొజూ పాడుకుంటూ ఉంటారు ,
ఆ ఆత్మీయ కుటుంబం లొ వున్న సొని లాప్ టాప్ అంటె నా ప్రాణం " అంటూ అవేశం గా చెప్పాడు డెల్ లాప్ టాప్

ఒక్క సారిగా గట్టి గా నవ్వి ఇలా అన్నాడు డెల్ డెస్క్ టాప్ "
వాళ్ళ కున్న రాం తొ కనీసం ఒక ఎం.పి-3 పాట ప్లె చెయ్యడానికి పది నిమిషాలు తీసుకునే విండౌస్ 95 వంశం తొ మనకు వియ్యమా !!,
వాళ్ళకి USB అంటె తెలియదు , ఒక్క లేటెస్ట్ సాఫ్ట్ వేర్ కుడా లోడ్ చెయ్యలెరు , గ్రాపిక్స్ పని చెయ్యవు , DVD లెదు ,
కనీసం CD డ్రైవ్ కుడా లెని ఆ సొని తొ నీకు పెళ్ళీ అసంభవం , నీ కొసం Solaris గారి అమ్మాయి Netra , Apple గారి అమ్మయి iPod , ఇంకా IBM ,
లాంటి వారికి, మా అబ్బయి వున్నడు అని మాట ఇచ్హాను, నీ మూర్కత్వం వదిలి నెను చెప్పిన మాట విను "

"నాన్నా " అని ఒక్క సారి గా అరిచాడు డెల్ లాప్ టాప్ "
లేటెస్ట్ టెక్నాలజి తొ ప్రెమ ని , అప్యాతానురాగలని కొనలేరు నాన్న !!
ఒక్క సారి ఆలొచించండి, వీస్టా ఎన్ని సార్లు హాంగ్ అయ్యింది ? ఎన్ని వైరస్ లు వచ్హాయి ?
అంత పెద్ద రాం , హార్డ్ డిస్క్ వున్నా ఏమి లాభం , ప్రతీ రోజూ ఏంటీ వైరస్ నడపనిదె మీకు రోజు గడవదు ,
మీకున్న లేటెస్ట్ టెక్నాలజి తొ వైరస్ ని ఆపగలరా ? ఎప్పుడు ఈ వైరస్ వస్తుందో అని అను క్షణం భయపడూతూ వుంటారు,
మీ పెద్ద కొడుకు లాజెర్ ప్రింటర్ , ఎప్పుడు పేపర్ జాం అవుంతుందొ వాడికే తెలెయదు ,
ఇక చిన్న కూతురు వైర్లెస్స్ రౌటర్, ఎప్పుడు ఎవడొచ్హి కనెక్ట్ అవుతాడా అని 24 గంటలు బయపడుతూ వుంటారు,
అన్ని వుండి ఏం లాభం ? ఇదీ ఒక ఆపరేటింగ్ సిస్టమేనా ? "

"మెగా గిగా అయినా సరె నేను సొని నే పెళ్ళీ చెసుకుంటా !! " అంటూ బాధా గా అన్నడు డెల్ లాప్ టాప్


తన కళ్ళ లొ నీళ్ళూ తుడుచుకుంటు డెల్ డెస్క్ టాప్ ఇలా అన్నడు
"భ్హాబూ !!! డెల్లు , ఇవాళ నా రాం క్లీన్ చెసావు బాబు !!,నా డిస్క్ పిండి నట్టు చెప్పావు ,
ఇన్నాళ్ళు టెక్నాలజి మోజు లొ పడి మన (basics) ప్రాధమిక సూత్రాలను మరిచాను, నన్ను క్షమించు ,
నేనే మీ పెళ్ళీ దగ్గర వుండి హైటెక్స్ లొ జరిపిస్తాను నాయనా"


ఆ సంతొషం లొ డెల్ లాప్ టాప్ ఇలా పాడసాగడు
"గాల్లొ తేలినట్ట్తుందె ,గుండె పేలి నట్టుందె
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందె"

ఈ విషయం తెలిసి సొని కుడా ఇలా అందుకుంది
"వస్తాడు నా డెల్ లాప్ టాప్ ఈ రోజు , రానె వస్తా ఆ ఆ ఆ డూ ...."

కధ సిలికాన్ సిటి కి మనమింటికి

Thursday, December 4, 2008

కోకిలలు


కల
నాకు ఒక కల వచ్హింది ,
అందులొ నేను లేచికూచున్నా ఏం చెయ్యలొ తెలియక
పడుకుని మళ్ళీ కలలుకంటున్నా !!!

ఊహ
పొద్దున్నె ఆలొచిస్తు వెళ్ళీన నా ఊహ ఒక కొండ మీద కుర్చుంది,
పక్కనే ఎవరొ వున్నారు , "ఎవరు నువ్వూ" అంది ,
చిన్ననవ్వు తొ సమాధానం వచ్హింది
"నువ్వే !! నిన్న రాత్రే వచ్హాను"

మాటలు
నేను మాట్లాడుతున్నా ,
నా మాటలు అందరి చెవుల్లొ దూరాయి
అదేంటో !! కొందరి నోటిలొంచి వేరే మాటలు బయటకు వచ్హాయి
అవి నా చెవిలొ దూరి, నొటితొ యుద్ధం మొదలు పెట్టాయి

చిన్న గొడవ
ఒక చిన్న విషయం నా దగ్గరకు వచ్హి ఇలా అంది
అర్ధం అయ్యేలా వివరిస్తె,"నాకామాత్రం తెలియదా" అంటారని తనని క్లుప్తంగా చెప్పమంది
సరే అని క్లుప్తంగానె చెప్పా, అదికాస్తా అపార్దం అయ్యి కూర్చుంది ,
అది చిన్న విషయాని తొక్కెసి, గొడవని నా మీదకు పంపింది !!


Wednesday, December 3, 2008

రాంగొపాల్ వర్మ!! నీ పని నువ్వు చూసుకో !!

రాంగొపాల్ వర్మ !!! ఏం ఉద్ధరిద్దామని వెళ్ళావు తాజ్ హొటల్ సందర్శనకి ?సమాజానికి ఉపయోగపడె ఒక్క సినిమా తీయవు , దయ్యలు, భూతాలు, మాఫియా, ఫాక్షన్, తప్ప నీకు ఇంకేమి తెలియదు. ఇప్పటిదాక ఒక్క సమాజ సేవా కార్యక్రమం లొ పాల్గొనలెదు , కనీసం తాజ్ ని చుసాక ఐనా ఎమైన చెస్తావా అంటె అదీలెదు. సారి చెప్పక పొయినా పర్వాలెదు , చనిపొయిన వారికి సంతాపం ప్రకటించు చాలు. దాడి జరిగిన ప్రదెశాలకి సంఘ సేవకులు, పొలీసులు,డాక్టర్లు, లాంటి వారు వెడితె చాలా ఉపయోగం.పొనీ !! ,ఆడా మగా కాని ఒక హీరొ పిలిచాడె అనుకుందాం, పిలిస్తె వెళ్ళిపొవడమెనా !! అస్సలు యేమాత్రం సంబంధం లేని నువ్వు అక్కడి కి వెళ్లి ఏం పీకుదామ్నుకున్నవ్ ? ముంబై సంఘటలని తెలిక గా తీసుకున్న విలాస్ రావ్ లాంటి వాళ్ళని ని కేవలం పదవి నించి తప్పిస్తె సరి పొదు , క్రిమినల్ కేస్ పెట్టాలి !!

Monday, December 1, 2008

షాపింగ్: ముందు కొని పడ్దేదాం,తర్వాత ఆలోచిద్దాం !!

షాపింగ్ లొ నేను గమనించిన సంగతులు !!, మీకు కుడా ఏమైన అనిపిస్తె ఇక్కడ రాయండి

* అక్కడ ఏమున్నాయొ అవే కొంటాం,మనకు అవసరమైనవి దొరక్క పొతె, ఖాళి చేతులతొ తిరిగిరాము.

* మన బడ్జెట్ చెప్పడానికి మొహమాటం, ఒకొక్క సారి వాడికి నచ్హిన రేంజిలొనే కొంటాం

* భారి డిస్కౌంట్ అంటాడు , దాని అసలు విలువ ఎంతొ అస్సలు పట్టించుకొము

* రేటూ తక్కువగా వుంది అని కొని పాడేస్తాం , కాని అది అవసరమా కాదా అని చూడం !

* షాప్ కి వెళ్తె మన ఇంటి లొ వాడకుండా ఓ మూలన పడి వున్న వాటి సంగతి అస్సలు గుర్తుకు రావు,

* అవతలవారికి కొనెటప్పుడు ఆ వస్తువు మనకు నచ్హిందొ లేదొ చుస్తాం కాని,అది ఇచ్హెవారికి ఉపయోగం వుందా లేదా అని చూడం

Saturday, November 29, 2008

మంచి ముత్యాలాంటి మాటలు !!!

నా అంతట నేను నిజం చెప్పను , అడిగితె మాత్రం అబద్దం చెప్పను ,
****************

జీవితం లొ బాధలు తప్పనిసరి , కాని బాధ పడాల వద్ద అనెది మన చెతులలొనే వుంది
****************

కొంత మంది దేముడు, వాళ్ళ వైపే ఉన్నాడు అనుకుంటారు ,

కాని కొద్ది మంది మాత్రమే, తము దేముడు వైపు ఉన్నం అనుకుంటారు

Friday, November 28, 2008

వలలొ వెతికి పట్టుకున్నఅందమైన గోడ కాగితాలు!!

ఇంటర్నెట్ లొ ఎప్పుడో ఎవరి ద్వారానో దొరికిన వాల్ పేపర్లు ....


















Thursday, November 27, 2008

పూరి జగన్నాథ్ !! నువ్వు అంతే నా !!!

అందమైన ప్రాంతాలు మన దేశం లొ వుంచుకొని , పటయా , పిటాయ అంటూ బాంకాక్ దాకా పొవడం ఎందుకు ? అప్పుడ్డపుడు ఇక్కడ కూడా కొన్ని పాటలు తీయండి. పొనీ అక్కడ ఏమైన కొత్త ప్రదేశాలు చుపిస్తారా అంటె , ఎప్పుడూ అవే కొండలు,దీవులు, చప్పిడి ముక్కు విలన్సు. నేనింతె అని మాట వినక పొతె ఇలాగే వుంటుంది మరి. థాయిలాండ్ గొడవల్లొ ఇర్రుకొన్న నేనింతె సభ్యులు పూరి , రవితేజ ,సియ , మరియు మిగత సభ్యులు క్షెమం గా తిరిగి రావాలని కోరుకుందాం.

Wednesday, November 26, 2008

Tuesday, November 25, 2008

తెలంగాణా వచ్హేసింది !! ఓటరులకు మనవి !!!

సొనియా గారికి టైం దొరికింది !!! తెలంగణా ఇచ్హెసారు !!!తొలి సారి ఎన్నికలు జరగబొతున్నయీ !!
మొత్తం సీట్లు 107* , ఈవిధం గా రావడనికి 90 శాతం అవకాశం వుంది.
*షరతులు వర్తిస్తాయి
తె.రా.స : 20
న.తె.పా : 10
ప్ర.రా.పా : 20
కాంగ్రెస్ (తె) : 20
తె.దె.పా +మిత్రులు : 20
బి.జె.పి (తె) : 10
లొక్ సత్తా + ఇతరులు: 7

హంగు తప్పనిసరి , ఏ ఇద్దరు కలసినా మెజారిటి రాదు ,అంటే ఎం.ఎల్.ఎ లని కొనాలి , డబ్బులు వరద , అసెంబ్లి లొ మళ్లి అదే గొల గొల , అభివ్రుద్ది సంగతి దెముడెరుగు, ఎవడికి బలం లేక ఒకరినొకరు తిట్టు కొవడమే సరి పొతుంది , అవినీతి లేకుండా ఎంత కాలం వుండగలరు మన వాళ్ళు ? కాని కొంత మంది మాత్రం భలె అభివ్రుద్ది చెందుతారు , రెయల్ ఎస్టెట్ వ్యపారులు ,టి.వి-9 (తె),టి.వి-5 (తె) ,ఈనాడు (తె),సాక్షి (తె),ఇంకా చెప్పలంటె బాగ డబ్బు వున్నవారు..ఇంకా..ఇంకా..
అందుకని, మంచైన , చెడైన , ఎదో ఒక్క పార్టి నే గెలిపించ ప్రార్దన

ఇట్లు
అభివ్రుద్ది కోసం ఎదురు చూసె సామన్య భారతీయుడు ( కమల్ హసన్ టైప్ కాదు)

Monday, November 24, 2008

Thursday, November 20, 2008

Q సెన్స్! ( దయచేసి క్యు పద్దతి పాటించండి )



అది ఒక పెద్ద షాపింగ్ మాల్ బిల్లింగ్ కౌంటర్ ,నా ముందు ఒకావిడ లైన్ లొ నించుంది , నా వెనకాల ఎవరు లెరు , ఇంత లొ ఒకాయన ముందుకు దూసుకుపొయి తన బట్టలు కౌంటర్ లొ ఇచ్హాడు, కౌంటర్ లొ వాడికి కొంచెం మతి స్థిమితం వున్నట్టుంది , లైన్ లొ రండి సార్ అన్నాడు . ఆ వచ్హిన ఆయన కి మతి స్థిమితం ఇంకా ఎక్కువ వున్నటుంది ,ఒక్క సారిగా నా ముందు వున్న ఆవిడ కి నాకు మధ్యలొ దూరబొయాడు , నాకు అరి కాలి లొ మంట నెత్తికెక్కింది , నా ముందు వున్న ఆవిడ ,నెను ఒక్క సారి గా అరిచాం " బాబు కళ్ళు కనపడటం లెదా?? , ఇక్కడ లైన్ వుంది " అని. ఒక వెకిలి నవ్వు నవ్వి నా వెన్నకి వచ్హాడు ఆ మనిషి . ఈ మధ్య ప్రతి షాప్ , మాల్స్ ,ఫ్రెష్ ల లొ ఇలాంటి వ్యక్తులులను తరచు గా చుస్తున్నం.వారికి కనీసం ,అక్కడ క్యు వుంది ,పాపం ఎంతో ఒపికగ కొంత మంది వున్నారు అని తట్టదు. ఇలాంటి మతి స్థిమితం లేని అనాగరికులకి పద్దతి నెర్పాలసిన బాధ్యత ఆ షాప్ యాజమన్యం కి ఎంతైనా వుంది. మన చెప్తె, మాటల యుద్ధం తప్ప ఏమి వుండదు .అసలే ఈమధ్య, పది ఏళ్ల పిల్లల నించి డెబ్భయ్ ఏళ్ల ముదుసలి వరకు అందరికి రక్త పొటు చాలా ఎక్కువ గా వుంటొంది ,అదీ మన హైదరబాద్ లొ !! ఈ విషయం లొ మనం మిగతా దేశాల నించి నెర్చుకొవలసినది ఎంతైనా వుంది .

Tuesday, November 18, 2008

ఈ పాట నాకిష్టం !! లాలి లాలి (ఇందిర)


ఆ..ఆ..ఆ...ఆ ...ఆ
లాలి లాలి అను రాగం సాగుతుంటె యేవరూ నిదురపోరే

చిన్న పోదామరి చిన్నిప్రాణం

కాసే వెన్నేలకు విచే గాలులకు హ్రుదయం కుదుట పడదే

అంత చేదా మరి వేణు గానం


కళ్ళ్లు మేలుకుంటె కాల మాగుతుంద భారమైన మనస

ఆ..ఆ..ఆ..

ఆ పగటి బాదలన్ని మరిచిపొవుటకు ఉంది కాద యి ఎకాంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటె యేవరూ నిదురపోరే చిన్న పోదామరి చిన్నిప్రాణం
స మ గ పా ......


యెటొ పోయెటి నీలి మేఘం వర్షం చిలికి వెల్లసాగె

యేదో అంటుంది కోయేల పాట రాగం ఆలకించసాగె

అన్ని వైపులా మధువనం పులుపూయదా

అనుక్షణం అణువణువునా జీవితం అందచెయదా అమ్రుతం
లాలి లాలి అను రాగం సాగుతుంటె యేవరూ నిదురపోరే

చిన్న పోదామరి చిన్నిప్రాణం

కాసే వెన్నెలకు విచే గాలులకు హ్రుదయం కుదుట పడదే

అంత చేదా మరి వేణు గానం

***********

పాడినవారు : హరిణి

సంగీతం : ఎ ఆర్ రహ్మన్

సాహిత్యం : సిరివెన్నెల

ప్రస్తుతానికి కష్ట పడి టైప్ చెసింది : నేను

నా మొట్ట మొదటి డిజిటల్ కెమెరా ఫోటోలు 2001







పాపం మహిళా ప్రేక్షకులు !!!

ఈ మధ్య సోని టి.వి లో వస్తున్న స్క్రోల్లింగ్ చూసి నా గుండె తర్రుక్కు పోతోంది ,
ఎన్ని కష్టాలు వచ్చాయీ మహిళా ప్రేక్షకులకి ,
పాపం ఎవరో మధ్య గొడవలో సీరియల్స్ కొత్త ఎపిసోడ్స్ రావటం లేదట ,
అందుకని పాతఎపిసోడ్స్ రిపీట్ చేస్తునారు !!! ఇలా ఎంత కాలం ? ఇంకెంత కాలం ?

Saturday, November 15, 2008

మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలంటే ?

మీ తల్ల్లి తండ్రులు చెఫ్పిన మాటలు మీకు సరైనవి అని అనిపించే సమయానికి ,

మీరు చెప్పె మాటలు మీ పిల్లలకి తప్పు గా అనిపిస్తాయి

జీవితం ఒక చక్రం ,

మీరు మీ పెద్దవాళ్ల కి ఏమి ఇచ్హారొ, మీ పిల్లలు మీకు అదే ఇస్తారు.





Thursday, November 13, 2008

రాజకీయ నాయకులందరికి సి.ఎం బహిరంగ లెఖ -1

సి.ఎం అంతె ముఖ్యమంత్రి అనుకునెరు !!!
సి.ఎం అంతె కామన్ మాన్ !!!!

భాదితులని పరామర్శ కి వెళ్ళె ప్రతి నాయకుడు మరియు కార్యకర్త , భాదితులకి 100 రుపాయలు ఇవ్వలి . వూరికె పెపర్ లొ ఫొటొ కొసమె పరామర్శ లా ?


రాస్తా రొకొ ,అసెంబ్లి ముట్టడి,కలక్తరెట్ ముట్టడి ,అని నానాగొల చేసి ఎం లాభం , ముట్టడి చేసి ఎం చెస్తారు , దాని వలన అసలు వాళ్లకి ఎమి ఇబ్బంది వుందడు, అందుకె , ఎవరితె మీ టార్గెటొ ఆ పార్టి అధినెత హైదరబద్ వస్తుంటె శమషాబద్ ఏర్ పొర్ట్ లొ ఒక పది వెల మంది తొ యెరైవల్స్ గేటు దగ్గర రాస్త రొకొ చెయ్యండి , దెబ్బకి మీరు చ్హెపిన మాట వింటారు.

లేక పొతె ఎవరితె మీ టార్గెటొ ఆ పార్టి పెద్ద నాయకుల కొడుకొ , కుతురొ పెళ్ళి జరిగె హాల్ కి ఒక పది వేల మంది తొ వెళ్ళి గట్టి గా అరవండి .మహా ఐతె దీని వలన లాఠి దెబ్బలు కొంచం గట్టిగా తగులుతయె కాని మాంఛి పబ్లిసిటి వస్తుంది .


నాయకులు వాళ్ళ నచ్హిన టైం లొ నే ధర్న లొ , రోడ్ షౌ లు, రాస్త రొకొ లు, బంధ్ లు చెస్తారు , ఒక్క సారి వాళ్ళు అతి ముఖయమైన సమయం లొ అంటె వాళ్ళ ఇంటి లొ పెళ్ళి , అత్యవసర వైద్య చికిస్త చెయించు కొనె టైం, లొ

మనం వెళ్ళి వారికి మద్దతు గా చెస్తె పరిస్థితి ఏంటి ? వాళ్ళు ఎప్పుడు ట్రాఫిక్ జాం లొ ఇరుక్కొకుడదా ?


నాయకుల నిరసన లొ ఎప్పుడు సామన్య ప్రజలే బాధ పడలా ??


Wednesday, November 12, 2008

తెలంగాణ తెసుకొంటే ఆంద్ర ఫ్రీ - పార్టు 2


నా టప కి వచ్హిన ఒక కమెంట్ కి ఎదురు టప , అంటె రెప్లయ్ ,
నేను అంధ్ర వాళ్ల ప్రతినిధిని ని కాను , నేను తెలుగు జాతి ముద్దు బిడ్ద ని,తెలంగణ మీ చెతులలొ వుంటె తప్పకుండ తీసుకొండి , ఏవరు అడ్దుపడరరు ,మా చెతులలొ వుంటె తప్పకుండ పువూలలొ పెటి మీకు ఇస్తాం, అయినా ఇస్తె అడ్డు పడడనికి మెమంత ? మెము ఎవరు ? ఎవరు ఎవరు ?ఎన్ని నిర్ణయలు ప్రజల ఆమొదం లెకుండ తీసుకున్నరు మన లని పాలించిన నాయకులు నా టపా ముఖ్యొదెసం కెవలం తెలంగాణా నాయకుల గురించె , లక్ష్యన్ని చెరకుండ అది వస్తె ఎంచెయలొ అలొచించె మన నాయకులు చుసి బాధ తొ రాసిన టాపా, తెలంగణ రాష్ట్ర విభజన అంత సులువు కాదు అది ఒక మహ ప్రక్రియ , ఆ సాధన కొసం నాయకులు ఇకమత్యం గా వుండాలి , తెలుగు ప్రజల లొ సహనం కావాలి , వుద్యమం అంటె అందరు కలసి చెసె పొరాటం , ఎవడ్దికి తొచినది వాడు అంతుంటె , మీరు అప్పుడ్దు అల ఎందుకు చెసారు , ఇలా ఎందుకు చయ్యలెదు , మాకు అది కావలి , ఇదికావలి అనే మాటలు పక్కన పెట్టి ,

రాష్త్రని తెచుకొండి , మేము మీ రాష్త్రని కి వలస వస్తాం,తెలంగణ రాకుండ అడ్డు పడెది , మాలాంటి సామన్య తెలుగు ప్రజలు కాదు , నీతి లెని నాయకులె !!

ఒక్క సారి ఏం వీ ఆర్ శాస్త్రి గారు రాసిని "ఏది చరిత్ర" చదవండి ,రాజుల , నాయకుల చెతకాని తనం వల్ల మనం మన దేశం ఎం కొల్పొయమొ .ఈ వాదొపవదాలు ఇంతటితొ కట్టి పెట్తి ,తెలంగణ వచ్హకా కలుదాం !!!!

Tuesday, November 11, 2008

తెలంగాణ తీసుకుంటే ఆంధ్ర ఫ్రీ !!!!

తెలంగణా కొసం పొరాడె నేతలకి ఒక చిన్న మాట,
అన్ని ప్రాంతల నించి వచ్చి కుల, మత, పార్టి , బాషలకి అతీతంగా ,అభివ్రుది చెసిన హైదరాబద్ ఒక్క తెలంగణా కె రాజధాని కాదు, హైదరాబద్ మన తెలుగు ప్రజల రాజధాని. మీరు హైదరాబద్ , గొదావరి , క్రిష్త్న జలాలు , బద్రచలం అన్ని తీసుకొండి, వీటితొ పాటు విజయవాడ, వైజగ్ , తిరుపతి , కాకినడ, శ్రికాలుళం,అన్ని తీసుకొండి , అంతెందుకు మన రాష్త్రనికి పేరు తెలంగణా అని పెట్టిస్తె పొలా ?? తెలంగణా పెరు చెప్పుకొని మంచి గా రాష్త్రమంతా అభివ్రుది చెసుకొవచ్చు ...

వెనుకబాటు కి కారణం అభివ్రుది చెందని మన రాజకీయ నాయకులె !!!

చిన్న చిన్న సమస్యలు ఎవరి సహకారం లెకుండ మన నాయకులు పరిష్కరించవచ్చు . ప్రజలు తమకు ఇచ్హిన అమూల్యమైన అవకాసన్ని ఇదు సంవత్సరాలు గాలికి వదిలి , ధర్నలు ,రాస్త రొకొ, బందులు ,తొ కాలం వెళ్ళతీసిన మన నాయకులని ఏమి అనాలి ? ఏమి చెయ్యలి ?

Monday, November 10, 2008

మొద్దు శీను - మొద్దు మీడియా !!!

ఈ మధ్య కాలం లో మన దేశం లో ఎవరు చనిపోయిన , ఎవరు అద్బుత విజయాలు సాధించిన, వారి బాధ , కృషి, వారి పుట్టు పూర్వోత్తరాలు , గురించి ఏమంత గా రాయక పోయిన , మొద్దు శీను చచ్చాక మీడియా ఇస్తున్న కధనాలు చూస్తుంటే వెగటు పుడుతోంది , ఇవాళ పేపర్ లో మొద్దు శీను గురించి , అతన్ని చంపిన వ్యక్తీ గురించి ఎన్ని కధనాలు , ఎలా నేరస్తుడిగా మారాడు , ఎలా హత్యలు చేసాడు , ఇవ్వని మనకి అవసరమా ? ఇక టీవీ చానల్స్ సంగతి అయితే చెప్పనఖర్లేదు , అన్ని పేపర్ మెయిన్ పేజి లో , టీవీ న్యూస్ లలో క్లోజ్ అప్ లో మొద్దు శీను ఫోటో అవసరమా ?
మన ఫై మీడియా సెన్సార్ అవసరం ఎంతైనా వుంది
అ రోజు వచ్చే రోజు కోసం ఎదురు చూడటం తప్ప మన ఏమం చెయ్యలేం!!!

Friday, November 7, 2008

భలే రావు కధలు - రవితేజ దుకుతాడ ?

హైదరాబాద్ లో అది ఒక పెద్ద కాలేజీ , టైం 9:30AM అయింది .
కాలేజీ ఐదో అంతస్తు పిట్ట గోడ మీద రవితేజ నడుస్తున్నాడు ,
ముందు గానే ఆ ఫై అంతస్తు కి వెళ్ళే డోర్ బయటనించి లాక్ చేసేసాడు ,
తన ఫోన్ లో ఎవరికో ఫోన్ చేసాడు ,
టైం 9:45AM
కాలేజీ ముందు ఒకటే కోలాహలం !! ఎవరో పోలీస్ కి ఫోన్ చెయ్య మన్నారు , ఎవరో కింద కు దూకకు రా అని అరుస్తున్నారు , TV1 నించి TV99 వరకు అందరు వచేసారు , ఈగల్లా జనాలు చేరిపోయారు ,

ఇంత లో పోలీసులు ఒక మైక్ లో గట్టి గా మాట్లాడడం మొదలు పెట్టారు , " హలో బాబు కింద కు దూకకు , నీ కు ఎం కావాలి " , రవి తేజ గట్టి గా అరిచాడు " అనుక్ష నా కు ఐ లవ్ యు చెప్పాలి "
ఒక పక్క గా బేలా గా చూస్తోంది అనుక్ష , " తను గాని చెప్పక పొతే నేను ఇక్కడ నించి దుకెస్త "
ఒకా సారి గా మళ్లి కలకలం , టీవీ వాళ్ళు తమ పని తఅము చేసుకు పోతున్నారు , రవి తేజ మిత్రులు అనుక్ష ని బ్రతిమలుతున్నారు , పోలీస్ లు ఒక వల పాతుకొని కింద నిలపడ్డారు ,

నువ్వు ఏదో ఒకటి మాటలాడు అని అనుక్ష ని అందరు అడుగుతున్నారు , " వాడు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు ,నేను కాలేజీ కి చదువు కోవడానికి వచ్హా ప్రేమ దోమ నాకు ఇష్టం లేదు" అంది అమ్మయకం గా
"నువ్వు అలా మాటలాడితే వాడు దూకి చస్తడే " అంది అనుక్ష సహచరి మమత .

అనుక్ష కి కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి . పైన రవితేజా పిచ్చి పట్టిన కోతి లాగా అటు ఇటు తిరుగుతూ అరుస్తున్నాడు ," నాకు అనుష్క కావాలి " అంటు.
ఇంతలొ పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చింది ఒక పోలీస్ జీప్ అందులోంచి ఒక కాలు ముందు పెట్టి కింద కు దిగాడు IG భలే రావు ,

ఒక్క సరి గా అందరు పోలీస్ లు సార్ అంటు కంగారుగా వచ్చారు , ఒక పోలీస్ మొతం వివరించారు .
భలే రావు అక్కడున్న మైక్ చేతి లో కి తీసుకొని , అనుక్ష వైపు నేనున్నాను అని సైగ చేసి ,
సైలెంట్ అంటు గట్టి గా అరిచాడు , ఒక్క సారి గా అందరు భలే రావు వైపు తిరిగి , భయం గా చూడ సాగారు ,
సౌండ్ పెంచి పైకి చూస్తూ " హలో రవి తేజా , ఎలా వున్నావ్ ? నేను చెపేది జాగర్త గ విను , ఈ రోజులలో ఒక మనిషి చస్తే ఎవరు పట్టించుకోవటం లేదు , మన దేశం లో రోజు ఎంతో మంది అమాయకులు , పిల్లలు చని పోతున్నారు ,
మనం ఆ వార్త చదివి కొంచం సేపు బాధ పడటం , తర్వాత మర్చి పోవటం , బిజీ జీవితం , మామూలే , నీలాంటి పిరికి వాళ్ళు బ్రతికిన ఎవరికీ వుపయోగం లేదు , చచ్చి సాదిదాం అను కునే వాళ్ళు బ్రతికి కూడా ఏమి సాధిం చలేరు
నువ్వు చస్తే ఎవరు మారారు , ఇంక కాసేపట్లో , నేను అందరిని క్లాసు కి పంపుతాను , టీవీ లో నీ న్యూస్ కూడా ఇంక రాక పోవచ్చు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఫైనల్ క్రికెట్ గేమ్ మొదలు అవుతోంది , సో కిందకు దూకి కాలేజీ కి ఒక రోజు సెలవ ఇస్తావో , బుద్ధి గా మెట్లు దిగి క్లాసు కి వేల్తావో నీ ఇష్టం . , సో బెటర్ లక్ , కింద కు వచ్చి మల్లిఅనుక్ష కి ఏమినా హాని తలపెట్టావో , నీ అంతు చూస్తా !! " ఒకా సారి గా చప్పట్ల తో ఆ ప్రదేశం మారుమోగిపోయింది .ఒక్క సారి గా అంత ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు , ఏమి చెయ్య లో తెలియక తల పట్టుకొని పిట్ట గోడ మీగ కూర్చున్నాడు ,.

చావడానికి చాల ధైర్యం కావాలంటారు , కాని ఏమి చెయ్యాలో చేతకాక , తనమీద ఆధారపడే వాళ్ల గురించి ఆలోచించకుండా చచ్చే వాళ్లు అత్యంత పిరికి వాళ్లు.

Thursday, November 6, 2008

భలే రావు కధలు - డబ్బు జర భద్రం

చైతన్య పూరి ఐ సి ఐ సి బ్యాంకు నించి భలే రావు ఒక పెద్ద బాగ్ తో బయటకు వచ్చాడు ,

ఇంతలొ ఒక వ్యక్తీ వచ్చి " సార్ మీ డబ్బులు కింద పడిపోయాయి " అన్నాడు ,

వెంటనే భలే రావు తన చేతి లో బాగ్ కింద పెట్టి ఆ కింద పడ్డ పది రూపాయల నోట్ లు తీసు కొని లెక్క పెట్టాడు ,

మొత్తం వంద రూపాయ లు వునాయి , ఆ డబ్బు లు జేబు లో పెట్టి తల త్రిప్పి చుసేలోగా ఆ వ్యక్తీ భలే రావు బాగ్ పట్టుకొని పరుగెత్తడం ప్రారంభించాడు .

వెంటనే భలే రావు ఒక చిరు నవ్వు నవ్వి , గట్టి గా అరిచాడు " హలో ఆ బాగ్ ని కాస్త చెత్త బుట్ట లో పడేసి వెళ్ళు నాయనా !!!"

తన ప్యాంటు లోపల వున్నా మరో ప్యాంటు లో వున్నా అప్పుడే తెసుకున్న డబ్బులు ఒక్క సారి తడుముకుని , వంద రూపాయలు లాభం అనుకుంటూ తన స్కూటర్ స్టార్ట్ చేసాడు .

మనకు తెలియకుండా మన వస్తువు పోతే అది మన అజాగ్రత వల్లే .

మన అజాగ్రత దొంగల కి అవకాశం కాకూడదు.

అందుకని భలే రావు లాగ దొంగలని బురిడి కొట్టే లాగ కొద్ది గా తెలివిగా , జాగర్త గా వుండండి .

Tuesday, November 4, 2008

కోకిలలు

నా మనసులో నీతో మాటలాడుతూ
అలసిన నా నాలుక

నీ గురించి ఆలోచిస్తూ కళ్లు ముసుకున్నా
ఫకున నవ్వింది పిల్ల కల

నీ కళ్ళతో అలా ఒక్క సారి చూస్తావు
నా కళ్లు దారి తప్పి ఎటో తిరుగుతాయి !!!

ఒంటరి గా కూర్చుంటా నా
ఎక్కడినించో వచ్చి చేరుతాయి నీ జ్ఞాపకాలు !!

Monday, November 3, 2008

కోకిలలు అంటే ?

కోకిల చూడటానికి బాగోదు కాని మంచి గాత్రం వుంది
అలాగే నా పదాలకి ప్రాస , వ్యాకరణం వుంకపోవచ్చు , కాని మంచి అర్థం ,భావం , వుంటాయీ
హృదయానికి సున్నితంగా హత్తుకుంటాయి !!!

నేను కవిని కాను , అప్పుడప్పుడు ఏదో అలా రాస్తువుంటావు ,

రజని రోబో : ఆలాగ ??

ఈ న్యూస్ ఆర్టికల్ లో శంకర్ జామర్, వాడి షూటింగ్ ఫోటో లు తీయకుండా జాగర్త పడుతునాడట ,
జామర్ తో సెల్ ఫోన్ కాల్స్ జాం అవుతాయే గాని సెల్ లో ఫోటో లు తీయచ్చు అని శంకర్ కి తెలియదా లేక
ఈ వెబ్ సైట్ వాళ్ళకి తెలియదా ?

http://telugu.greatandhra.com/sangathulu/2-11-2008/jam_3.php

Sunday, November 2, 2008

మా బుజ్జి గాడు !!

పడుకుంటే ఒక పట్టన లేవడు లేస్తే పడుకోడు

అన్నం వాడే తినాలి తిన్నాక నీనే శుభ్రం చేయాలి

వాడు కామ్ వుంటే మనకు తోచదు , వాడు చేస్తే కోపం వస్తుంది

షాప్ కి వెళ్ళితే వాడి చూపు కార్ టోయ్స్ మీద పడుతుంది , నా చుపు ఆ కార్ లో ఎన్ని బాటరీస్ వాడలో చూస్తాను ,

అర్థం కాకపోయినా కార్టూన్ చూడాలి అంతే !!


Saturday, November 1, 2008

మన భాష తెలుగు !!!

తెలుగు గడ్డ మీద పుట్టావు
తెలుగులో అక్షరాలు దిద్దావు
తెలుగు పండుగలు జరుపుకుంటావు
తెలుగు పత్రిక చదువుతావు
తెలుగు పాటలు వింటావు
తెలుగు సినిమాలు చూస్తావు
మరి నీ పిల్లలకి తెలుగు ఎందుకు నేర్పించవు ??

నేటి మధ్య వయసు తల్లి తండ్రి లే రేపటి తరాని కి పునాదులు !!!

ఆంధ్రప్రదేశ్ అవతరణ మరియు తెలుగు ప్రాచిన హోదా సందర్బముగా --- రమణ

టీవీ సం గతులు !!!

* రిమోట్ నొక్కి నొక్కి నా బ్రొటన వేలు నెప్పి వస్తోంది

* నా టీవీ లో హిమేష్ రెశమ్మయ కనపడితే ఛానల్ ఏనిమల్ ప్లానెట్ కి మారేల ట్యూన్ చెయ్యాలంటే ఎలా ?


* రిమోట్ ఎప్పుడు దాకుంటుంది

* కార్టూన్ నెట్వర్క్ లో తెలుగు డబ్బింగ్ చేసే వాళ్ళని ఒక్క సారి కలవాలి

* నేను న్యూస్ , న్యూస్ కోసమే చూస్తా , న్యూస్ రీడర్ ఎవరినా పర్వాలేదు !!!

* పాపం ఫ్లాష్ న్యూస్ వేసేవాడి చెయ్యె తిప్పి తిప్పి నెప్పి వస్తుంద్ఏమో

* టీవీ వాళ్ళు మోహాని కే తెల్ల రంగు వేస్తారు , చేతులకి ఎందుకు వెయ్యరో ?

Quotes


The only person who has never made a mistake Will be the one who never tried anything new.So Todays errors are tomorows Experience.


Every Relationship is like a Glass ,A scratch on anyside will reflect on the otherside.
Always handle Relationships with care...!

Think thousand times before taking a decision. But dont think even once after taking a decision.Face life Boldly!

కోకిలలు

తను ఊఁ అందని తనువు ఇస్తే ఎలా ?
మనసు ఊఁ అందని మనువుఆడితే ఎలా ?
జీవితం అంతం అయ్యే వరకు తెలియదా ?
ఇది అంతం లేని ఆరంభం అని !!
అనుభవించి న వాడిదే జీవితం అని ?

చేతనైతే మలచుకో
చేతకాకపోతే తలవంచి నడచుకో
జీవితం నీ చేతులలో నే వుంది, నీ చేతలలోనే వుంది ,
తరతరాలుగా వస్తున్నా తలరాత మార్చుకో ,
తనను తనువు లో కలిపెసుకో
జీవితాంతం , జీవితం అంతం అయ్యే వరకు , తనలోనే వుండి పో !!!



Friday, October 31, 2008

AR Rahman Yuvraj Songs

Must listen Album of the year.
do not just listen , put your Mp3 player head-set, at high volume or in your home theater,switch off lights and listen at night especially below songs.

Tu meri dost*****The best from AR Rahman ,

Zindagi *****Slow and smooth
Manmohini Morey****Excellent beat
Tu muskura ****** Smooth

Download all songs from here :
http://www.indianpad.com/album/356728/356728/

Thursday, October 30, 2008

Quotes

Today we have bigger houses but small families

More degrees yet less common sense

Advanced medicines but poor health.

Two income but more divorces.

Touched Moon but no contact with our neighbours.

High income yet less peace of mind.

Wednesday, October 29, 2008

Quotes of the day !!!

It is very difficult to get what you like , but it very easy to adjust with what you have got.

Who says nothing is impossible, i have been doing nothing for years.


Before you criticize someonce , you should walk a mile in thier shoes.

The quickest way to double your money is to fold it in half and put it back in your pocket.

Monday, October 27, 2008

Happy Deepavali

దీపావళి శుభాకాంక్షలు


బ్రెయిన్ వాష్ - 2

ఎదుటి వ్యక్తీ కి ఒక మంచి పని చేయక పోయిన , బాధ కలిగించే పని మాత్రం చేయకండి.

బ్రెయిన్ వాష్ -1

చాల మంది కి తామూ ఎంత అదృష్టవంతులో తెలియదు .
పక్క వాళ్ళ జీవితాలని చూసి , వారి పైకి కనపడే ఆనందాలిచూసి ,వాళ్ళ కృతిమ నవ్వులు చూసి ,
తమని చాలా దురదృష్టవంతులు అనుకుంటారు,

ఒక్క సారి ఆగండి, ఆలోచించకండి ,మీకు ఏమి లేదో అది ఆలోచించకండి,
ఏమి ఉందొ అది ఆలోచించండి ,ఆ బగవంతుడు ఏమి ఇచ్చాడో అది చుడండి .

ఈ రోజు బొమ్మ


Saturday, October 25, 2008

థాంక్స్ !!!

హలో అందరికి నమస్కారం ,
నా బ్లాగు నీ అప్పుడప్పుడు పలకరిస్తున్నదుకు ధన్యవాదములు.

ఇట్లు
రమణ

We are Like this !!!


We lose our health to make money and then lose our money to restore our health.

By thinking anxiously about the future, we forget the present,
such that we live neither for the present nor the future.

Friday, October 24, 2008

Idea to RBI : Get Black Money out and wasted

Stop printing all Current Currency Notes.
Release New Currency in new color and with new photos,
Ask people to convert Old Currency with new currency at Income Tax Office.


Political Chess : Part-1




This can happen:
2009 AP Elections: Congress , TDP+TRS+Curryleave Parties ( CPI and CPM) , and PRP are going to Clash,
Let’s think hung majority , to all parties,
Then TRS can give support TDP or Congress or PRP ,
in favor they may get something and may not get what they are fighting for,

You know why ?
PRP is not interested in TDP?
Because 75% of PRP is filled with Ex-TDPs,
So if TDP joins PRP then PRP ship sinks ,
with Ex-TDPs and Real-TDPs fights.

Want to see what will Chiru does?
Few intellectual people in AP are very interested in watching what Chiru does,
If he loses badly in 2009 elections , will he fight for people for next 5 years ?
Or go back to Movies?


Thursday, October 23, 2008

God and You : Small Story of the Day

God showed him 4 pairs of footprints and said

“ My dear these footprints are from your happy times where I always followed you”
Later God showed only one pair of footprints and said “ These are from your difficult times in your life”

Then immediately he said “ Why you have not followed me in my difficult times and left me alone”

God Smiled and said “ My dear these are my footprints , during your difficult time , I am carrying you”

God is always with you in your difficult time, just think back , if he is not, then you never comeout of it.




Wednesday, October 22, 2008

Cuties





Quote of the Day !!

Memories:

Some memories ,We never forget,
Some memories ,We never remember,

Some memories ,Just flashes by themselves,
For which there is a reason, but we cannot explain.

Tuesday, October 21, 2008

Do you remember these symbols !!!

if not or even yes , just read once just for a change

Monday, October 20, 2008

Baby Girl / Boy Names

Please reply me if you like it or take it from here :-)






Girl:
Sahaana
Saketa
Sarayu
Sravantika
Parmita
Skanda
Nihaarika
Sambhavana
Mridula

Praseeda
Megha















Boy:
Nihaar

Aswath
Arnav

Rishit
Devan
Mahat

Pictures of the Day !!!!