Monday, December 8, 2008

మనసు తత్వం - పెళ్ళైయిన వారికి మాత్రమే !! -1

అలా అని ఏం లేదు ఎవరైనా చదవచ్హు ....

ఇటుకలతొ గోడ కడుతున్నపుడు ఒక్కకసారి , రెండు ఇటుకల మధ్య దూరం వస్తుంది,
దానికొసం ఏదైన ఒక ఇటుకని తాపి* తొ ఒక్క సారి గట్టిగా కొట్టి ,చెక్కి సమానం చెస్తారు.
అప్పుడే గోడ బలం గా ధ్రుడంగా నిలుస్తుంది.
కాపురం కుడా అంతె , మాటల దెబ్బలు తగుల్తూనె ఉంటయి ,
ముందు ముందు సాఫీగా సాగాలంటె అప్పుడప్పుడు గట్టిగా మనసులొ వున్న మాటలని చెప్పక తప్పదు.
(*తాపి : అంటే ఇల్లు కట్టెటప్పుడు వాడె ఒక పనిముట్టు.)


*******************

పెళ్ళైన కొత్తల్లొ చిన్న చిన్న గొడవలు,అభిప్రాయబేధాలు సహజం ,అప్పుడూ మనసు చాలా బాధ పడుతుంది,
పెళ్ళైన కొన్ని ఏళ్ళకి కుడా చిన్న చిన్న గొడవలు,అభిప్రాయబేధాలు వస్తూనే వుంటయి.
కాని అప్పుడు ఎవరు అస్సలు బాధ పడరు ఎందుకంటె ఆ సమయానికి అన్ని అలవాటు అయిపొతాయి.
నా ఉద్దెశం బాధపడటం అలవాటు అవుతుంది అని కాదు , అవతలి వారి మనస్తత్వం అలవాటు అవుతుంది అని.
మీరు ఎలా వుండాలొ అవతలి వారికి చెప్పె కన్నా,అవతలవారికి ఏం నచ్హుతుందొ తెలుసుకొని ప్రవర్తించాలి.


*********************


సాధారణంగా చాలా మంది తమ బాగస్వామి ఇలా వుండాలి అని ఆలోచించకుండానే పెళ్ళీ చెసుకుంటారు,
కొన్ని అనవసర విషయాలలు తప్ప అవి, రంగు, చదువు , ఎత్తు, పెళ్ళయాకా ఉద్యొగం చెస్తావా ?
ఇండియా నా లేకా అమెరికా నా? ఇంకా ఇంకా ...
పెళ్ళైన తర్వాత బాగస్వామి ప్రవర్తన, మాట తీరు , అలవాట్లు, నడవడిక, వల్లన తమకు దొరికినవి , దొరకనివి తేటతెల్లమౌతాయి ,
అవన్ని దౄష్టి లొ పెట్టుకొని ,పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకి తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలొ కచ్హితమైన అభిప్రాయానికి వస్తారు.
కాని అప్పటి కి పరిస్థితి చెయ్యి దాటి పోతుంది , రాజి compramise అనేది మొదలౌతుంది , ( సినిమా వాళ్ళని పక్క పెట్టండి) ,
అటువంటి జీవితాన్ని చాలా తక్కువ మంది ఆనందిస్తూ గడుపుతారు ,అదెలా అంటె ...

(ఇంకా వుంది)

6 comments:

  1. బాగా రాస్తున్నారు మీ ఆలోచనలు. దయచేసి కొంచెం స్పెల్లింగు మీద కూడా శ్రద్ధ పెట్టండి.

    ReplyDelete
  2. మీ ఆలోచనలు బాగున్నాయ్! కానీ అక్కడక్కడా ప్రవాహం తెగినట్టుగా అనిపిస్తోంది. స్పెల్లింగుల విషయంలో కొత్తపాళీ గారి మాటే నా మాట.

    ReplyDelete
  3. మీ సూచనలకి ధన్యవాదములు,

    ReplyDelete
  4. "పెళ్ళైన రెండు మూడు సంవత్సరాలకి తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలొ కచ్హితమైన అభిప్రాయానికి వస్తారు.
    కాని అప్పటి కి పరిస్థితి చెయ్యి దాటి పోతుంది"

    అది చదివిన వెంటనే పక్కున నవ్వాను :-)

    ReplyDelete
  5. బాగున్నాయ్ మీ ఆలోచనలు.

    ReplyDelete
  6. good....u seems like a guy with hidden treasures..carry on...v r waiting for next
    thread

    ReplyDelete