Friday, December 12, 2008

తొక్కలో ట్రైనింగ్ సెంటర్ !!

సారీ !!! టీ.విలొ ట్రైనింగ్ అని రాయబోయి అచ్హుతప్పు పడింది,
మావాడు చూడకుండా అచ్చు ఎసేసినాడూ,ఏటి అనుకోకండే ..అచ్హుతప్పులు ఎక్కడికక్కడ సక్కగా సరిదిద్దినాం !!



రండి రండీ రండీ !!! మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఒక లాప్ టాప్ బాగ్ ఉచితం !!
మళ్ళీ సారి !! "బాగ్" ని చిన్న అక్షరాలతో రాయడం పోయినాడండి !! ఆయ్!!
టీ.వి రంగం లొ తల వేడెక్కిన పెద్దలు మీకు దగ్గర వుండి మీకు అన్ని విషయాలు తలక్కెకిస్తారు.



మా బాధకుల (సారి బోధకుల) అనుభవాలు :

అనంత మానస తరంగాలు అనే సీరియల్ కోసం టేబిల్ కింద కూర్చుని ఎవరూ చూడకుండా రాసిన స్క్ర్రిప్ట్ .
"స.రి.గ.మ.ప.ద.ని.స.ని.ద.ప.మ" హింది సింగర్స్ తొ తెలుగు పాటల కార్యక్రమం.
"అబ్బనీ తీయని దెబ్బ !!" అంతా తమిళులే ఉన్న ఏకైక తెలుగు పాటల డాన్స్ కార్యక్రమం .
చెత్త ప్రశ్నలు ,పిచ్హి జవాబులు .
లక్ష ఎపిసొడ్స్ పూర్తి చెసుకున్న సీరియల్ (ఇది ఎప్పుడు,ఎవడూ మొదలెట్టాడో మాకే తెలియదు),
అ.క.కు.త.క.అ (అసూయ,కన్నీళ్ళూ,కుట్ర,తగాదా,కపటబుద్ది,అక్రమ).




అర్హత :
ఏంటీ జొకులా !! మీరు మనిషి అయితే చాలు !!
మీరు ఆల్రెడీ టీ.వి లొ వున్న/పాల్గొంటున్నా ఈ కొర్సు తీసుకోవచ్హు.



మా ట్రైనింగ్ లో మీకు నేర్పించేవి :

పోటిలొ మీరు వొట్ ఔట్ లేదా ఓడిపొతే మీరు ఎలా వెక్కి వెక్కి ఏడవాలి !!
వేరే వాళ్ళు పోటి లోంచి ఔట్ అయితే , పైకి ఏడుస్తూ ఎలా నటించాలి ?
జడ్జిల కి మాంఛి మాటల్ ట్రైనింగ్ అంటే ...
"చింపావు","కత్తి"," ఫాబులస్స్","సూపర్ర్","ఇరగదీసావు" ఇలాంటివి మాదగ్గర పది వేల మాటలు ఉన్నాయి.
రాజకీయ ముఖాముఖిలలొ గట్టిగా అరవడం ఎలా ? అవతలి వారి మాటలు వినకుండా మీ మాటలే వినపడెలా ఎలా మాట్లాడాలి ?
వార్తలు చదివేటప్పుడు కనుబొమ్మలు ఎలా ఎగరేయాలి , ఇంకా అనేక హావ భావాలు ఎలా పెట్టాలి?
జడ్జి మిమ్మలని తిట్టాలంటే ఎలా పిచ్హిగా మాట్లాడాలి ? తద్వారా , మీకు ఎక్కువ పాపులారిటీ ఎలా తెచ్హుకోవాలి ?
పర భాషా జడ్జి ఖూని తెలుగుని అర్థం చేసుకోవడం ఎలా ?
మీరు టి.వీ నటులైతే ,డైలీ సీరియల్ షూటింగ్ అయిపోయాకా మీరు మాములు మనిషిగా ఎలా మారాలి ?



చివరిగా టీ.వి ప్రేక్షకులకి ఒక క్రాష్ కోర్స్:
పగలకొట్టబడిన టి.వీ ని మళ్ళీ మళ్ళీ ఎలా బాగు చేయ్యాలి ?

2 comments:

  1. పిచ్హి గా కాదు పిచ్చి గా picci=పిచ్చి teccu=తెచ్చు.దయచేసి సరిచేసుకోండి,తెలియచెప్పినందుకు కోపం తెచ్చుకోవద్దు.

    ReplyDelete
  2. తప్పు సరి చేసినందుకు థాంక్స్. చిన్న ఫాంట్ లో నేను ఆ వత్తు గమనించలేదు. (పిచ్చి/పిచ్హి, తెచ్హు, తెచ్చు)

    ReplyDelete