Wednesday, November 12, 2008

తెలంగాణ తెసుకొంటే ఆంద్ర ఫ్రీ - పార్టు 2


నా టప కి వచ్హిన ఒక కమెంట్ కి ఎదురు టప , అంటె రెప్లయ్ ,
నేను అంధ్ర వాళ్ల ప్రతినిధిని ని కాను , నేను తెలుగు జాతి ముద్దు బిడ్ద ని,తెలంగణ మీ చెతులలొ వుంటె తప్పకుండ తీసుకొండి , ఏవరు అడ్దుపడరరు ,మా చెతులలొ వుంటె తప్పకుండ పువూలలొ పెటి మీకు ఇస్తాం, అయినా ఇస్తె అడ్డు పడడనికి మెమంత ? మెము ఎవరు ? ఎవరు ఎవరు ?ఎన్ని నిర్ణయలు ప్రజల ఆమొదం లెకుండ తీసుకున్నరు మన లని పాలించిన నాయకులు నా టపా ముఖ్యొదెసం కెవలం తెలంగాణా నాయకుల గురించె , లక్ష్యన్ని చెరకుండ అది వస్తె ఎంచెయలొ అలొచించె మన నాయకులు చుసి బాధ తొ రాసిన టాపా, తెలంగణ రాష్ట్ర విభజన అంత సులువు కాదు అది ఒక మహ ప్రక్రియ , ఆ సాధన కొసం నాయకులు ఇకమత్యం గా వుండాలి , తెలుగు ప్రజల లొ సహనం కావాలి , వుద్యమం అంటె అందరు కలసి చెసె పొరాటం , ఎవడ్దికి తొచినది వాడు అంతుంటె , మీరు అప్పుడ్దు అల ఎందుకు చెసారు , ఇలా ఎందుకు చయ్యలెదు , మాకు అది కావలి , ఇదికావలి అనే మాటలు పక్కన పెట్టి ,

రాష్త్రని తెచుకొండి , మేము మీ రాష్త్రని కి వలస వస్తాం,తెలంగణ రాకుండ అడ్డు పడెది , మాలాంటి సామన్య తెలుగు ప్రజలు కాదు , నీతి లెని నాయకులె !!

ఒక్క సారి ఏం వీ ఆర్ శాస్త్రి గారు రాసిని "ఏది చరిత్ర" చదవండి ,రాజుల , నాయకుల చెతకాని తనం వల్ల మనం మన దేశం ఎం కొల్పొయమొ .ఈ వాదొపవదాలు ఇంతటితొ కట్టి పెట్తి ,తెలంగణ వచ్హకా కలుదాం !!!!

2 comments:

  1. తెలంగాణా వచ్చాక కలవడానికి, తెలంగాణా రాదులే ఊరుకోండి! ఇదంతా రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోడానికి ఆడుతున్న నాటకం అని గ్రహించకుండా ఆంధ్ర, తెలంగాణా అని దెబ్బలాడుతున్నారంటే , ఏమనాలో తోచడం లేదు. ఎప్పుడైనా మనమే, అంటే ప్రజలే ఫూల్స్! తెలంగాణా నాయకుడు ఎవడికీ తెలంగాణా అంతే చిత్త శుద్ధి లేదు, ఆంధరా నాయకులకు ఆంధ్రా అంటే గౌరవం లేదు. మనమెందుకు కొట్టుకు చావడం?

    ReplyDelete
  2. మిత్రమా నీకు మొదటగా తెలంగాణ ప్రజల తరపున దన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆంధ్రా తో విలీనం సమయం లో కూడా తెలంగాణ ప్రజలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జస్టిస్ ఫజల్ అలీ కమీషన్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఐనా దురదృష్టవశాత్తు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. నాయకులకు చిత్తశుద్ది లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. 369 మంది తెలంగాణ విద్యార్థుల్ని చంపిమరీ సమైక్యాంధ్రను కొనసాగించడం ప్రజాస్వామ్యం సిగ్గుపడల్సిన విషయం. నేను MVR శాస్త్రి రాసిన ఏదీ చరిత్ర చదివాను. తర్వాత ఆయనే రాసిన ఇదీ చరిత్ర కూడా చదివాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చరిత్ర ఎలా మారుస్తారో చూడ్డానికి చరిత్రలోకే వెల్లక్కర్లేదు. నిన్న మొన్నటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు చూసినా తెలుస్తుంది.

    పొట్టీ శ్రీరాములు చనిపోయింది మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతాన్ని విడగొట్టడానికే కాని తెలంగాణ తో కలపడానికి కాదు. ఐనా మన చరిత్రకారులు (?) అంధ్ర ప్రదేశ్ అవతరణ పొట్టి శ్రీరాములు త్యాగం తో ఏర్పడ్దదని నిస్సిగ్గుగా పిల్లలకు బోదిస్తున్నారు.

    కర్నూలు రాజధానిగా అంధ్రా రాష్ట్రం ఉండింది. ఆ తర్వాత హైదరాబాదు రాజదానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది అనే ఉంటుంది కాని ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదు రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఉందని ఎందుకు చెప్పరు. ఇలాంటి నీతి మాలిన రాతల్ని ముందు మనం ఖండిస్తే తర్వాత చరిత్రలోకి వెళ్లొచ్చు.

    తెలంగాణ ప్రజలు 50 ఏండ్ల నుండీ ప్రత్యేక రాష్ట్రం కోసం తమవాణిని వినిపిస్తూనే ఉన్నారు.

    ప్రజా ఆకాక్షలు నెరవేరాలి
    ఇందుకు ప్రజాస్వామిక వాదులైన ఆంధ్రా సోదరుల మద్దతు రావడం అభిలషణీయం.

    ReplyDelete