Thursday, June 7, 2012

తర్వాత చూద్దాం లే !!!


రోగం ముదిరిన తర్వాత డాక్టర్ ,
జరగకూడనిది జరిగితే జ్యోతీష్యుడు,
పొట్ట బాగా పెరిగిన తర్వాత డైట్ కంట్రోల్,


Wednesday, June 6, 2012

ప్రతీ మగాడి విజయం వెనుకా ఒక ఆడది

"ప్రతీ మగాడి విజయం వెనుకా ఒక ఆడది " అని ఎవరు చెప్పారో గాని , అది కచ్చితంగా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు అని నమ్మే ఒక పురుష అహంకారి చెప్పి ఉంటాడు .
ఎందుకంటే , ప్రతీ మగాడి విజయం వెనుక , కాదు , పక్కన ఆడది ఉండాలి .
నేను ఉద్యోగం చేస్తున్నాను , నువ్వు ఇంటి , వంట పని చెయ్యి , అనేది అందరి వాదన .
చేసే పని ని బట్టి ఒక వ్యక్తి యొక్క స్థాయి ని నిర్ణయించడము బహుశా మన దేశం లోనే ఉంది కాబోలు .
పని లో నేర్పు , ఓర్పు  ని ఎవరు గమనించరు .

Sunday, February 15, 2009

కోతి నించి కంప్యుటర్ వరకు !! మనిషి పరిణామం




Friday, February 13, 2009

బంగారు నగలు ఎందుకు కొంటారు ? మగవాళ్ళకి మాత్రమే !!!

ఆడవాళ్ళు కూడా చదవచ్చు ,కాని పూర్తిగా గా చదవండి ,ఇది నా కల మాత్రమే !!

అసలు బంగారు నగలు ఎందుకు కొంటారు ?
అవతల వారు కొనడంవలన
కొత్త మోడల్ రావడంవలన
డబ్బులు ఎక్కువై

అసలు బంగారు నగలు ఎందుకు వేసుకుంటారు?
అవతలి వారికి చూపించడానికి

చూపించి ఏం చేస్తారు ?
మీకే కాదు నాకూ ఉన్నాయి అని చెప్పడానికి

అసలు బంగారు నగల వలన ఉపయోగాలు ఎమిటీ ?
ఏమి లేవు, ఆ!! ఒకటి ఉంది
వేసుకోవడం వలన మనిషి శరీరం తో ఎటువంటీ రసాయనిక చర్య జరగదు

మరి నష్టాలు ?
అవి జాగర్త గా దాచలేక , లాకర్లు, బీరువాలు, తొ సతమతమవ్వడం .


******************

బాగుంది కదా అని కొంటారే గాని ఆ నగ తమకు నప్పుతుందా లేదా అని ఆలోచించరు ,
మీ నక్లెస్,చైన్,ఉంగరం,బ్రాస్లెట్ చాలా బాగుంది అంటారే గాని , మీకు బాగా నప్పింది అనరు??
మోడల్స్ నాజూకు గా అందం గా వుంటారు ,వారు ఏ నగలు ధరించినా బాగుంటుంది.
పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా , ఆ ఫొటోలు , యాడ్స్ చూసి కొనేస్తారే తప్ప,
చాలామంది కి వారు వేసుకున్న నగలు అస్సలు నప్పవు.
అందం గా కనపడలనుకోవడం ,అలంకరించుకోవడం తప్పు కాదు,కాని
దానికి ముందు అందమైన మనసు, అందమైన ప్రవర్తన, ఆరోగ్యకరమైన కొవ్వు లేని శరీరం, మీద ద్రుష్టి పెట్టండి.
చాలా మంది మొహానికి మేకప్పు , భారీ బట్టలు ,వొళ్ళంతా నగలు దిగేసుకుంటారే గాని ,తాము ఎంత బరువు వున్నాం అని చూసుకోరు ??
అందానికి నిర్వచనం, ఆత్మ విశ్వాసం తొ ఆరోగ్యం గా ఉండడం,నిటారుగా నిలబడి , అవతలవారి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడం.
నగలు,చీరలు ,బట్టలు మీద వున్న శ్రద్ద ఆరోగ్యం పైన ఎందుకు పెట్టరు ?
40,50 ఏళ్ళు వచ్చేసరికి మీ నగలు,చీరలు,బట్టలు ఎందుకూ పనికిరావు,
ఏ పండగ వచ్చిన, శుభకార్యం వచ్చిన ఈగల్లా నగల లేదా బట్టల షాప్ లో మూగిపోతారే గాని
ఒక్కసారైనా ఉన్నవి చాలు అనుకొని ఒక్క ఉపయోగ పడే వస్తువు అస్సలు కొనరు.


ఒక బరువైన ఖరీదైన మెరిసే లోహం వేసుకొని పొందే మానసిక ఆనందం ఎమిటో నాకు అర్థం కాదు.
బంగారం కుడా ఇనుము లాంటిదే ,కాక పొతే బంగారం ఎక్కువ గా మెరుస్తుందంతే .


మీ దగ్గర డబ్బులు వుంటే మీకు సుఖాన్ని ఇచ్చే,
ఒక మంచి మసాజ్ కుర్చి కొనండి, మీరు అలసి పోతె మీ కాళ్ళు ,నడుము వత్తుతుంది.
ఒక మంచి మ్యుజిక్ సిస్టం కొనండి ,మంచి పాటలు మనసుకు హాయినిస్తాయి .
ఒక మంచి వ్యాయామ పరికరం కొనండి,
ఒక మంచి రిక్లైనైనర్ సోఫా కొనండీ,
ఒక మంచి పర్యాటక ప్రదేశానికి ప్లాన్ చేయ్యండి .

డబ్బుల్ని, మీకు లేదా అవతలి వారికి ఉపయోగపడేలా వాడండి,ఒకరికి చూపించుకోవడానికి వాడకండి.

*******

ధన్ !!ధడ్ ..!! ఒక పెద్ద శబ్దం !! లేచి చూస్తె మంచం పై నుంచి కింద పడ్డా!!
ఇందంతా నాకల !! ,హమ్మయా !! ఇంకా నయం నా బ్లాగ్ లో పెట్టలేదు ..
ఇంతలో ఒక చిన్న అరుపు వినిపించింది " ఏమండీ ఇవాళ మనం చందనా బ్రదర్స్ కి షాపింగ్ కి వెళ్ళాలి మర్చి పోయారా"?
"అబ్బే లేదు అంటూ క్రింద నించి లేచా" అప్పుడు నా మొహం కింద ఫొటొ లా వుంది ....






Wednesday, February 11, 2009

కొత్తగా పెళ్ళయిన మొగుడ్స్ చూడాల్సిన పోటో !!!

మీ ఆవిడ కి ఆ నగలు నచ్చితే పాపం కొని పెట్టండి !!





ఇది కేరళా లో ఒక దంపతుల పెళ్లి ఫోటో !!!

సేకరణ : గ్రేట్ ఆంధ్రా

Monday, February 9, 2009

ఒబామా ప్రసంగ సమయం లో ఎగిరే పళ్ళం!! UFO

వీడియో లో మీ కుడి నించి ఎడమకు చుడండి !!


http://www.youtube.com/watch?v=KikkGlCAKHw&feature=player_embedded

Friday, February 6, 2009

పవన్ కళ్యాణ్ పులి టైటిల్ సాంగ్ వినండి , లిరిక్స్ కుడా !!

పాట లంకె :
http://rapidshare.com/files/194278186/puli_Title_Song.మ్ప౩

లిరిక్:
ఒక ఇనుప డబ్బా లో గులక రాళ్ళు వేసి అటు ఇటు కదుపుతూ ,
దానిని మధ్యలో చీపురు తో బాదుతూ ,
మధ్యలో పులి , పులి అని కరెంట్ షాక్ తగిలినట్టు అరవండి !!!!!!

Thursday, January 29, 2009

అందరు తప్పక చదవాల్సిన నేటి ఆంధ్రజ్యోతి వ్యాసం

ఇది రాసిన వారికి , చదివి మారిన వాళ్ళకి నా అభినందనలు !!!

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/jan/28main7

Wednesday, January 28, 2009

మనసు తత్వం : ఆచారాలు,పూజలు,దైవభక్తి,పద్దతులు,నమ్మకాలు.




కొంత మంది తమకు తెలిసిన వాటినే పాటిస్తారు,
మరి కొంత మంది తెలిసిన వాటిలొ సులభమైన వాటినే పాటిస్తారు ,
ఇంకొంత మంది ,తెలిసిన వాటిలొ, సులభమైన వాటిలొ, తమకు ఏదైనా లాభం వుండే వాటినే పాటిస్తారు.


చాలా మంది, పాటించడం లో చూపే నిబద్దత, ఇతర విషయలాలో చూపరు,
పాటించడం వెనుక వున్న ముఖ్యొద్దేశం అస్సలు పట్టించుకోరు !!
ఆ పని అవ్వగానే చేతులు ,మనసు,బుర్ర,దులిపేసుకుని తమ అసలు ముసుగులో దూరిపోతారు .
మీరు చేసే పని మీరు చేయ్యండి , చేసిన తర్వాత మీ ప్రవర్తనని ప్రశ్నించుకోండి.


పెద్దలని అడగండి,పుస్తకాలు చదవండి,ఎందుకు చేస్తున్నాము అనే దానికి వివరణ ఇవ్వడానికి ప్రయతించండి ,
గుడ్డెద్దు చేలొ పడిన చదంగా ఉండకండి !!


Saturday, January 17, 2009

Youtube వీడియోలు మీ కంప్యుటర్లొకి ఎలా download చేయాలి ?

అంతే కాక Google Videos, Metacafe, Spike లను FLV, AVI, MOV, MPG or WMV formats లలొ download చేసుకోవచ్చు.

తద్వరా మీ ipod and video players కి copy చేసుకోవచ్చు.

ముందు మీకు నచ్చిన video, youtube లొ play చేయండి ,
ఆ video url ని కాపి చేసి కింద website లో ఇచ్చి download నొక్కండి.
http://www.savevid.com/

Friday, January 16, 2009

మనసు తత్వం : పెళ్లి కాని వారికి మాత్రమే !!!


ప్రేమించు లేదా పెళ్ళి చేసుకో !! ఏదో ఒకటే చెయ్యి !!
ప్రేమించి పెళ్ళి చేసుకోకు !! పెళ్ళీ చేసుకుంటె ప్రేమించలేవు !!


ప్రేమించు , ప్రేమిస్తూనేవుండు , ప్రేమను ఆనందించు , అనుభవించు ,
ప్రేమంటే అందని ద్రాక్ష !! దానిని అందుకోవాలని ,ఎగురుతూ ,పరిగెడుతు,అలసిపోతు,సొమ్మసిల్లుతూ,లేచి మళ్ళి పరిగెడుతూ,ఆనందించు ,అనుభవించు.
ప్రేమను అందుకుని శాస్వతం చేసుకోవాలనుకున్నవో ,నిండా మునిగిపోతావు.
ప్రేమంటె అందమైన ఇంద్రధనుస్సు !! చూసి ఆనందించాలేగాని
అందుకోవాలంటే శూన్యం తప్ప ఏమి దొరకదు .



పెళ్ళి చేసుకో ,సహజీవనం చేయి ,ఒకరినొకరు అర్దం చేసుకుంటూ ముందుకు పోండి.
పెళ్ళి చేసుకుంటే ప్రేమించడానికి తీరిక వుండదు ,
చేయవలసిన పనులు చాలా వుంటాయి ,చేతకాని పనులు చాలా తెలుస్తాయి !!
ఎప్పుడూ మాట్లాడని మాటలు వింటారు , ఎప్పుడూ వినని మాటలు మాట్లాడుతారు !!
బాధ్యతల సుడిగుండం లో ఈదుతూ,కొత్త సంబంధీకుల మాట పోటులు తట్టుకుంటూ ముందుకు పోతూ అసలు ప్రేమ అనే సున్నితమైన మాటే గుర్తుకురాదు !!!


అందుకే ప్రేమించు లేదా పెళ్ళి చేసుకో !! ఏదో ఒకటే చెయ్యి !!

Wednesday, January 14, 2009

శిక్ష తప్పదు !!

రెండు కళ్ళని చూసా ,తెలిసినట్టే కనపడుతున్నాయి ,
కాని తెలియనట్టు నటిస్తున్నాయి ,
లేడిని చూసిన పులిలా ఉన్నాయి ఆ కళ్ళు
రెప్ప పాటు లో నన్ను అమాంతం చూసి మళ్ళీ పక్కకు తిరుగుతున్నాయి,
మస్తిష్కంలో ఆలోచనలకి పదును పెట్టా ,
నిప్పురవ్వలా తళ్ళుక్కు మంది చిన్న జ్ఞాపకం.
ఆలోచిస్తు ఆ కళ్ళ వైపు తిరిగా,
చటుక్కున గుర్తుకువచ్చింది ,చాలా చాలా సంవత్సరాలక్రితం ..
మేము అడిగినంత కట్నం ఇవ్వలేదని "వద్దు" అనుకున్న అమ్మాయి.
మా ఆవిడ సంతోషంగా ఆవిడతో మాట్లాడి ఇటే వచ్చింది,
"ఏమండి !! మన అమ్మయి జాతకం పంపింది ఆవిడకే!!
అమ్మయి నచ్చిందట !! పెళ్ళి మాటలకి ఎప్పుడువస్తారూ అని అడుగుతోంది !!! "
చేసింది తప్పు అని లేటు గా అయినా ఇదే జన్మలో తెలుసుకుంటావు.!! దానికి శిక్ష కూడా ఈ జన్మలోనే పడుతుంది.

Tuesday, December 30, 2008

"నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు" !!!

నేను ఎప్పుడూ డిసెంబర్ 31 రాత్రి అంతగా జరుపుకున్నట్టు గుర్తులేదు, దానికి రెండు కారణాలు.
1. ఊగాది రోజే తెలుగు వారికి క్రొత్త సంవత్సరం వస్తుంది అని నమ్ముతాను కాబట్టి.
2. గత పది సంవత్సరాలు గా, ప్రస్తుతం కూడా, టెలీకాం రంగంలో ఉద్యోగం చేస్తుండడం తో ప్రతి డిసెంబర్ 31 రాత్రి, ప్రజల కాల్స్ , యెస్.ఎం.యెస్ ల వల్ల సర్వర్స్ లోడ్ పెరుగుతుంది కాబట్టి, వాటిని మానిటర్ చేస్తూ, సమస్యలు వస్తే సరిదిద్ది, అంతా సద్దుమణిగాకా తీరిగ్గా తెల్లవారు ఝామున నాలుగు లేదా ఐదింటికి ఇంటీకి చేరేవాడీని .

అంతే కాకకుండా డిసెంబర్ 31న నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పకుండా
"నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు" అని చెప్పేవాడిని,.



"నేటి మధ్య వయసు తల్లి తండ్రులే తరువాత తరానికి వారధులు . "


అందుకే !! ఎందుకో తెలియదు గాని నేను ఎప్పుడూ ఇంతే !!.



అదేకాక మావాళ్ళు చాలా మంది ఫ్రేండ్ షిప్ డే అని తెగ జరుపు కొనే వాళ్ళు ,
రంగు రంగు ల గ్రీటింగ్స్ , ఎవడో రాసిన పెద్ద పెద్ద సందేశాలు , ఇంకా ఇంకా , అటూ ఇటు తెగ పంపేసుకోనెవారు . నేను కావాలని ఫ్రేండ్ షిప్ డే తరువాత రోజు అందరికి "హాపి ఫ్రేండ్ షిప్ డే " అని ఈ-మైల్ పంపి ,కింద ఇలా రాసేవాడిని ..
" నిజమైన స్నేహితులకి ఏ రోజు అయితేనే ?" అని,
అలాగే వాలైంటైన్ డే ,మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇవన్ని కేవలం గ్రీటింగ్స్ మరియు గిఫ్ట్ షాప్ వాళ్ళని పెంచి పోషించడానికే !!!


మనసులో వున్న స్వచ్చమైన ప్రేమ భావాన్ని తెలపడానికి మంచి రోజు కోసం ఎదురుచూడకండి , !!







Wednesday, December 24, 2008

మనసుతత్వం : ప్రేమలో సక్సెస్ లేదా ఫెయిల్ !!!

ప్రేమ లో సక్సెస్ అయితే ఒక పాట పాడుకోవడమో లేదా ఒక పార్టీ చేసుకోవడమో ,
ప్రేమ లో ఫెయిల్ అయితే మందు కొడుతూ బాధ పడటమో ,లేదా ఆత్మహత్య, మనము రోజు చుసేవుంటాము ,
అసలు ప్రేమలో సక్సెస్ లేదా ఫెయిల్ అనేవి వాస్తవాని కి ఎందుకు పనికి రాని మాటలు,



ప్రేమలో సక్సెస్ అంటే ఒక అమ్మాయ్ లేదా అబ్బాయి మనసు గెలిస్తే సరిపోతుందా ?
సరే మనసు గెలిచావు ,ఇద్దరు ఇష్టపడ్డారు , తర్వాత ?



ఉద్యోగం,తల్లి తండ్రుల బాధ్యత ,నీ అలవాట్లు,నీ మనస్తత్వం ,నీ బాధ లు,నీ మీద ఆధార పడే మనుషు లు ,నీ కోపం ,నీ ఆరోగ్యం ,
వలన మీ మధ్య ఎటువంటి తేడాలు రాకుండా అవతలి వ్యక్తీ తో జీవితాంతం అవతలి వారి అభిప్రాయాలకి విలువ ఇస్తూ సాఫీ జీవితం సాగితే నే నీ ప్రేమ సక్సెస్ అయినట్టు .ఇన్ని అభిప్రాయాలని పంచుకొని ,అర్థం చేసుకుని, అవగాహన తెచ్చుకొని,ఒకరినొకరు సంసిద్ధం చేసుకోవడమే ప్రేమించు కోవడం,ప్రేమించు కోవడమంటె సినెమాలు , షికార్లు ,తో పాటు జీవితం లొ ఆఖరి అడుగు వేసె వరకు జరగబోయె సంఘటనలు అన్ని మాట్లాడుకోవాలి.


మా అబ్బాయి / అమ్మాయి కి పెళ్ళి కుదిరింది , అబ్బాయి ది చాలా పెద్ద ఉద్యొగం,అమ్మయి చాలా బాగుంటుంది,మంచి కుటుంబం, బాగా డబ్బు వుంది , నా గర్ల్ ఫ్రండ్ యస్ అంది, నాకు ఒక అబ్బాయి ప్రపొస్ చేసాడు, పెళ్ళీ ఎక్కడా ?, కట్నం ఎంత ? , వాలంటైనె గిఫ్ట్ ఏం కొంటున్నావ్ ?, హానీ మూన్ కి ఎక్కడికి వెల్తున్నారు ?నేను లవ్ లొ పడ్డాను ( అసలు లవ్ లో పడడం ఏమిటో , ఈ తెలుగు సినిమా మాట అంటే నాకు పరమ ఎలర్జి, హాయిగా మనసు పడ్దా, ప్రేమిస్తున్నా, ఇష్ట పడుతున్నా అనచ్చు కదా!! )ఇదే పైకి కనపడేది , కాని ,
ఎవరైనా ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నరు ? ఆ మాటలు, ఆ ప్రశ్నలు ,ఆ సమాధానాలు వాళ్ళ సంసారంకి,కలసి నడిచే జీవితానికి ఉపయోగపడతాయా? అని ఎందుకు ఆలోచించరు ? ఇది ప్రేమా మరియు పెద్దల కుదిర్చిన పెళ్ళీలకి వర్తిస్తుంది.

ఇద్దరు మనసులు కలయిక కేవలం తోలి అడుగు మాత్రమే.మీ తొలి అడుగు సక్సెస్ కావాలంటే ఇంకా ఎన్ని వేల ,లక్ష అడుగులో నడవాలి.


వంద అబద్దాలు ఆడి ఐనా ఒక పెళ్ళి చెయ్యాలన్నారు పాత పెద్దలు,
కాని నేను చెప్పెది ప్రేమ లేదా పెళ్ళీ అంటే వంద నిజాలు.
ప్రతీ చిన్న విషయం మాట్లాడుకొని తీరాలి ,మనస్పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాలి.



ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి సంబంధాలనైనా మెరుగుపరిచి దగ్గర చేసేది స్పష్ట మైన మాటలే.
మాట్లాడకపోతే ఏం జరుగుతుంది..కొన్ని నిజ సంఘటనలతో .... (ఇంకా వుంది)

Monday, December 22, 2008

సమాచారం - సముద్రగర్భ ఇంటర్నెట్ తీగలను ఎలా బాగు చేస్తారు ?

భారత దేశం నించి యూరోప్ కి వెళ్ళే సముద్రగర్భ ఇంటర్నెట్ తీగలు తెగినందున ఇంటర్నెట్ సర్విస్ లొ సమస్యలు , ఇంటర్నెట్ చాలా నెమ్మదించడం జరుగుతోంది . దీని వలన మన దేశం లొ 82% వరకు ఇంటర్నెట్ సేవలకి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. డిసెంబర్ 31 కి పూర్తిగా పునరుద్దరణ జరగచ్చు అని ఫ్రాన్స్ టెలికాం ఒక ప్రకటనలో తెలిపింది. సముద్రగర్భ తీగలని బాగుచేసే ఉహా వీడియో క్రింద చూడండి .
http://www.labnol.org/internet/internet-disrupted-as-undersea-cables-cut-again/6146/

Friday, December 19, 2008

మనసు తత్వం : పిల్లల అలవాట్లు!!

నేటి పిల్లల అలవాట్లు,తల్లి తండ్రుల పాత్ర :

తమ పిల్లలు కొన్ని విషయాల పై ఇష్టం చూపితే తెగ మురిసిపోతారు,లేదా మావాడూ పెద్ద వాడు అయిపోయాడు అనుకోవడం ,
వాళ్ళ కొత్త అలవాట్లని అంతగా పట్టించుకోకపోవడం ,వారి దైనందిన కార్యక్రమాల మీద అంతగా శ్రద్ధ పెట్టకఫొవడం నేటి తల్లి తండ్రులు చేస్తున్న తప్పులు.ఒక మంచి అలవాటు కొత్త గా నేర్పించకపోయినా కనీసం వారు రోజూ చేసే పనులని సక్రమంగా చేసేలా చూస్తే చాలు.
ఒక పద్దతి గా వారు చేసే పనులు,వారిని ఒక మంచి వ్యక్తి గా తీర్చిదిద్దుతాయి.


ముఖ్యంగా క్రింద విషయాలలో కొద్ది పాటి అజాగ్రత్త పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేయ్యగలదు.


ఆరోగ్యం:
అతిగా టీ.వి చూడడం !! పడుకుని , దగ్గరగా చుడడం.కంప్యూటర్ ఆటలు.వీటి వలన కంటికి చాలా ఒత్తిడి పెరుగుతుంది.ఇది చిన్న విషయమే అయినా దీని ఫలితం కొన్ని సంవత్సరాల తరువాత తప్పక కనపడుతుంది.
తక్కువగా నడవడం,ఆటలు ఆడకపోవడం.


శుభ్రత :
సరిగా పళ్ళూ తోముకోకపొవడం.
చాలా మంది పిల్లలకి పళ్ళు ఎలా తోముకోవాలో సరిగా తెలియదు , ఏదొ అటు ఇటూ గీకి పడేస్తారు.
స్నానం సరిగా చేయకపోవడం,
బాత్ రూం కి వెళ్ళి వచ్చకా చేతులు కడుక్కోకపోవడం,
బయటనించి రాగనే కాళ్ళు కడుక్కోకపోవడం,
బయటకి వాడె చెప్పులు, షూస్ తొ ఇంట్లొ తిరగడం,


ఆహారం:
చాలా మంది పిల్లలు అన్నం తినడం హడావిడీగా ముగించేస్తారు,ఏం తిన్నాడు ,ఎంత తిన్నడు అనేది ఎవరు చూడరు.
పిల్లల ఇష్టా అయిష్టాల ను పక్కన పెట్టి అన్ని తినేలా తల్లి తండ్రులే నేర్పించాలి .

భాద్యత:
ఇది వినడానికి చాలా పెద్ద మాట గా కనపడినా,
పిల్లలకి చిన్నప్పటి నించే వారి పనులు వారు చేసుకోవడం నేర్పించాలి.
వారు ఆట వస్తువులు వారే సర్దుకోవడం,
ఇంటిని శుభ్రంగా వుంచడం,
అప్పుడపుడు వారికి కొన్ని చిన్న చిన్న పనులు చెప్పడం
ఇంటికి ఎవరైనా వచ్చినపుడూ ఎలా మాట్లాడాలి ఎలా లో చెప్పడం .


ఇలా చెప్పుకుపోతే చాలానే వుంటాయి , కాని ఇక్కడ మనం ఒక విషయం గుర్తుకుపెట్టుకోవాలి,ఒక వయస్సు వచ్చాకా పిల్లలు తల్లి తండ్రులు మాట వినరు,ఆ వయస్సు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు.ఎందుకటే నేటి పిల్లలు చాలా తొందరగా పెద్దవారైపోతున్నారు.