Friday, February 13, 2009

బంగారు నగలు ఎందుకు కొంటారు ? మగవాళ్ళకి మాత్రమే !!!

ఆడవాళ్ళు కూడా చదవచ్చు ,కాని పూర్తిగా గా చదవండి ,ఇది నా కల మాత్రమే !!

అసలు బంగారు నగలు ఎందుకు కొంటారు ?
అవతల వారు కొనడంవలన
కొత్త మోడల్ రావడంవలన
డబ్బులు ఎక్కువై

అసలు బంగారు నగలు ఎందుకు వేసుకుంటారు?
అవతలి వారికి చూపించడానికి

చూపించి ఏం చేస్తారు ?
మీకే కాదు నాకూ ఉన్నాయి అని చెప్పడానికి

అసలు బంగారు నగల వలన ఉపయోగాలు ఎమిటీ ?
ఏమి లేవు, ఆ!! ఒకటి ఉంది
వేసుకోవడం వలన మనిషి శరీరం తో ఎటువంటీ రసాయనిక చర్య జరగదు

మరి నష్టాలు ?
అవి జాగర్త గా దాచలేక , లాకర్లు, బీరువాలు, తొ సతమతమవ్వడం .


******************

బాగుంది కదా అని కొంటారే గాని ఆ నగ తమకు నప్పుతుందా లేదా అని ఆలోచించరు ,
మీ నక్లెస్,చైన్,ఉంగరం,బ్రాస్లెట్ చాలా బాగుంది అంటారే గాని , మీకు బాగా నప్పింది అనరు??
మోడల్స్ నాజూకు గా అందం గా వుంటారు ,వారు ఏ నగలు ధరించినా బాగుంటుంది.
పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా , ఆ ఫొటోలు , యాడ్స్ చూసి కొనేస్తారే తప్ప,
చాలామంది కి వారు వేసుకున్న నగలు అస్సలు నప్పవు.
అందం గా కనపడలనుకోవడం ,అలంకరించుకోవడం తప్పు కాదు,కాని
దానికి ముందు అందమైన మనసు, అందమైన ప్రవర్తన, ఆరోగ్యకరమైన కొవ్వు లేని శరీరం, మీద ద్రుష్టి పెట్టండి.
చాలా మంది మొహానికి మేకప్పు , భారీ బట్టలు ,వొళ్ళంతా నగలు దిగేసుకుంటారే గాని ,తాము ఎంత బరువు వున్నాం అని చూసుకోరు ??
అందానికి నిర్వచనం, ఆత్మ విశ్వాసం తొ ఆరోగ్యం గా ఉండడం,నిటారుగా నిలబడి , అవతలవారి కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడం.
నగలు,చీరలు ,బట్టలు మీద వున్న శ్రద్ద ఆరోగ్యం పైన ఎందుకు పెట్టరు ?
40,50 ఏళ్ళు వచ్చేసరికి మీ నగలు,చీరలు,బట్టలు ఎందుకూ పనికిరావు,
ఏ పండగ వచ్చిన, శుభకార్యం వచ్చిన ఈగల్లా నగల లేదా బట్టల షాప్ లో మూగిపోతారే గాని
ఒక్కసారైనా ఉన్నవి చాలు అనుకొని ఒక్క ఉపయోగ పడే వస్తువు అస్సలు కొనరు.


ఒక బరువైన ఖరీదైన మెరిసే లోహం వేసుకొని పొందే మానసిక ఆనందం ఎమిటో నాకు అర్థం కాదు.
బంగారం కుడా ఇనుము లాంటిదే ,కాక పొతే బంగారం ఎక్కువ గా మెరుస్తుందంతే .


మీ దగ్గర డబ్బులు వుంటే మీకు సుఖాన్ని ఇచ్చే,
ఒక మంచి మసాజ్ కుర్చి కొనండి, మీరు అలసి పోతె మీ కాళ్ళు ,నడుము వత్తుతుంది.
ఒక మంచి మ్యుజిక్ సిస్టం కొనండి ,మంచి పాటలు మనసుకు హాయినిస్తాయి .
ఒక మంచి వ్యాయామ పరికరం కొనండి,
ఒక మంచి రిక్లైనైనర్ సోఫా కొనండీ,
ఒక మంచి పర్యాటక ప్రదేశానికి ప్లాన్ చేయ్యండి .

డబ్బుల్ని, మీకు లేదా అవతలి వారికి ఉపయోగపడేలా వాడండి,ఒకరికి చూపించుకోవడానికి వాడకండి.

*******

ధన్ !!ధడ్ ..!! ఒక పెద్ద శబ్దం !! లేచి చూస్తె మంచం పై నుంచి కింద పడ్డా!!
ఇందంతా నాకల !! ,హమ్మయా !! ఇంకా నయం నా బ్లాగ్ లో పెట్టలేదు ..
ఇంతలో ఒక చిన్న అరుపు వినిపించింది " ఏమండీ ఇవాళ మనం చందనా బ్రదర్స్ కి షాపింగ్ కి వెళ్ళాలి మర్చి పోయారా"?
"అబ్బే లేదు అంటూ క్రింద నించి లేచా" అప్పుడు నా మొహం కింద ఫొటొ లా వుంది ....






13 comments:

  1. "మోడల్స్ నాజూకు గా అందం గా వుంటారు ,వారు ఏ నగలు ధరించినా బాగుంటుంది."
    సన్నగా,నాజూకుగా ఉంటేనే అందం గా ఉన్నట్టా?
    :)

    ఇప్పుడంటె ఏదో ఫంక్షన్స్ కి పెట్టుకుంటున్నరు కాని,మరి పూర్వకాలంలో ఎప్పుడూ పెట్టుకునేవారు కదా?

    నగలు పెట్టుకోవటానికి కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి.

    చాలా బాగా రాసారు.కొంచెం అలోచించేలా ఉంది మీ పోస్ట్.
    :)

    ReplyDelete
  2. :). ఇంతకీ చందనా బ్రదర్సులో ఏం కొన్నారు? బంగారమేనా!

    ReplyDelete
  3. ఆహ్హా..........అనాల్సినవన్నీ అనేసి కల ని చెప్పి తప్పించు కుందామనే

    బంగారం ఎప్పటికీ వేస్ట్ కర్చు కాదు. అది ఒక ఆస్తి లాంటిదే. చూసారుగా రోజు రోజుకీ ధర ఎలా పెరుగుతుందో.
    డబ్బుంటే ఎలా అయినా ఖర్చు పెట్టేస్తాం.ఆస్తులు కొనేతంటటి పెద్ద మొత్తం లేనపుడు వున్న మొత్తం తో బంగారం కొనటం మంచిదేకదా. ఎందుకంటే బంగారం విలువ ఎప్పటికీ తరిగేదికాదు. తర్వాత పిల్లలకి ఇవ్వచు. లేదా అవసరమైతే నగదుగా మార్చుకోఅవచ్చు . ఎలాగూ కొన్నాప్పుడు దాన్ని కేవలం బీరువాలో దాస్తే వచ్చేదేమీ వుండదు కనుక వస్తువు రూపంలో అయితే సరదా తీరుతుంది.
    ఇక బట్టల విషయం బట్టలమీద వేలు ఖర్చు చేయటం సుద్ద దండగ. కట్టేకొద్దీ విలువ తరిగి చివరికి స్టీలు సామాను మిగులుతుంది.

    ReplyDelete
  4. బంగారు నగల వలన ఉపయోగాలుఏమీ లేవంటారా ?హన్నా ....కష్టాల్లో తాకట్టు పెట్టుకునేది మీరే ....
    :)

    ReplyDelete
  5. అందరికి కామెంట్స్ కి థాంక్స్ ,
    మహి గారు: నా ఉద్దేశం ,సన్నగా,నాజూకు గా ఉంటేనే అందం అని కాదు. అందమంటే మొత్తం శరీరం మరియు ప్రవర్తన అని.
    లలిత గారు : సరే అయెతే ఇంకనించి అందరం బంగారు బిస్కెట్లే కొందాం , నగలు వద్దు.
    పరిమళ గారు : ఒక మంచి ఉపయోగం చెప్పారు .

    ReplyDelete
  6. బాగుంది. ఇందులో కొన్ని మంచి ప్యాంట్లు ఉన్నాయి...:)

    ReplyDelete
  7. మీరు చెప్పినవన్నీ తప్పుకారణాలే! ఏ అలంకరణ సామాగ్రికీ లేని ఉపయోగం బంగారానికి ఉంది. విలువ పెరగడం! 2003 లో నేను తులం 5 వేలలో 50000 పెట్టి 100 గ్రాముల బంగారం కొన్నాను. ఇప్పుడు దానివిలువెంతో తెలుసా?

    బంగారాన్నీ కేవలం అలంకారానికే కాదు, అవసరానికి పనికొచ్చే పెట్టుబడిగా కూడా కొనొచ్చు!

    మసాజ్ కుర్చీ, రిక్లైనర్ సోఫా ఇవన్నీ రే సేల్ కి పనికిరావు మాష్టారూ!

    అన్నట్లు ఇవన్నీ మీ మేడమ్ మీకు చెప్పే ఉంటారే! అన్నట్లు ఫొటోలో మీరు భలే ఉన్నారు.

    ReplyDelete
  8. సుజాత గారు :బంగారం కొనడం వేరు , నగలు వేరు, జీవితాంతం డబ్బులు అలా నగలు,బంగారం, రూపంలో దాచుకొంటె ఇంక ఎప్పుడు అనుభవించాలి , అందుకే రెక్లైనైర్ చైర్, హొం థియేటర్ లాంటివి కొనాలి, అన్నట్టు ఇక్కడరాసినవి నేను మా మేడం తొ ఒక వంద సార్లు చెప్పి వుంటా .ఎవరి గోల వారిదే. నా ముఖ్యొద్దేసం నగల వల్ల మనకు ఏ విధమైన సుఖం రాదు అని . అన్నట్టు ఆ 100 గ్రా బంగారం ఎక్కడ పెట్టారేంటి ? :-)

    ReplyDelete
  9. బంగారం కుడా ఇనుము లాంటిదే ,కాక పొతే బంగారం ఎక్కువ గా మెరుస్తుందంతే!!

    ఆహా అలాగా!! అయితే నాకు 2 కిలోల బంగారం ఇనుము ధరకె ఇప్పించండి ప్లీజ్ :P

    ReplyDelete
  10. nagalu kanna, models baga untaru...

    models chala peddaga undi, nagalu chinnagauntundi...

    ante, modelsnu chusi nagalu konnandi ani.

    ReplyDelete
  11. Iam sure gold is good investment. Mana dabbu careful ga bangaram meeda pettavachhu. No dubt. Article bagundi. Gold akkuva konukkoni business start cheyyavachhu .

    ReplyDelete